తిరుమలలో చిరుత హల్ చల్ చేస్తోంది. రెండో ఘాట్ రోడ్ లో వస్తున్న జనాలపై దాడికి పాల్పుడుతోంది. చిరుత దాడిలో సోమవారం రెండు వేర్వేరు బైక్ వస్తున్న ఇద్దరు స్థానిక యువతులపై దాడి చేసింది. అదే సమయంలో మరికొందరు ప్రయాణికులు అటువైపు వస్తుండాన్ని గమనించిన చిరుత అక్కడి నుంచి పరారైంది. అప్పటికే చిరుత దాడిలో ఆ ఇద్దరు యువతులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.  కాగా క్షతగాత్రులను స్థానిక రుయా ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరుత కోసం గాలింపు..


చిరుత దాడి విషయం తెలుసుకున్న విలిజెన్స్ సిబ్బంది రుయా ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా చిరుత దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా భాధిత యువతలుు స్థానిక బాలాజీనగర్ వాసులుగా గుర్తించారు.కాగా దాడి ఘటన విషయాన్ని విజిలెన్స్ అధికారులు... ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఘాట్ రోడ్ పై వంటరిగా వెళ్తోద్దని ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు.


దాడి జరిగిందిలా...


చిరుత దాడి చేసిన తీరును బాధిత యువతులు మీడియాకు వివరించారు. రెండో ఘాట్ రోడ్ లో బైక్ పై వెళ్తుండగా తమపై వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించిందని బాధిత యువతులు పేర్కొన్నారు. చిరుత పులి మీదకు రావడంతో ప్రాణం పోయేంత భయం పుట్టిందని...అంతలోనే  కొందరు ప్రయాణికులు అటువైపు వస్తుండాన్ని గమనించిన చిరుత పరారైందని..దీంతో ఊపిరి పీల్చున్నామని బాధితులు వివరించారు. ఇదిలా ఉండగా  జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంలో అధికారులు విఫలం అవడం వల్లే తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత యథేచ్ఛగా జనాలపై దాడి చేస్తోందని స్థానికులు విమర్శించారు.