Vizag Gas Leak | విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే. ఆర్ఆర్ వెంకటాపురం ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరిన్ విష వాయువు లీక్ అయిన ఘటనలో 12 మంది చనిపోగా, వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. గ్యాస్ లీకేజీ ఘటనపై షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. ఏపీలో మరో 57 కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్న జరిగిన ప్రమాదంలో కేవలం స్టైరిన్ విషయవాయువు ఒక్కటే లీక్ కాలేదని, మరికొన్ని విషవాయువులు విడుదలయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి (పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) తాజాగా గుర్తించింది. స్టైరిన్ వాయువు 80 శాతం విడుదల కాగా, గాఢమైన ఇతర వాయువులు 20 శాతం వరకు విడుదలై ప్రాణ నష్టాన్ని కలిగించాయని ప్రాధమికంగా అంచనా వేశారు.  అందాలతో అదరగొడుతున్న RX 100 భామ


వెంకటాపురం, గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో స్టైరిన్‌తో పాటు పలు హైడ్రోకార్బన్లు, ఇతర వాయువులను గుర్తించారు. టోటల్ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని ఈ వాయువులను పేర్కొంటారు. చాలా రోజుల తర్వాత పని ప్రారంభించగా స్టైరిన్ వేడేక్కి ఆ ఆవిరిలో స్టైరిన్‌తో పాటు ఇథిలిన్, బెంజీన్ వాయువులు విడుదలైనట్లు కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది. రాష్ట్రంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో నిల్వ ఉన్న స్టైరిన్‌ను తరలించాలని ప్రభుత్వం ఇది వరకే సూచించింది. కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం


ఎల్‌జీ పాలిమర్స్ లాంటి సంస్థలు నిపుణుల్ని నియమించుకోవాలి. కానీ నిపుణులు లేకుండానే విషపూరిత వాయువులతో పనులు చేయడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు గ్యాస్ లీకేజీపై విచారణ జరిపేందుకు కొరియా నుంచి 8 మందితో కూడిన టీమ్ రెండు రోజుల కింటే విశాఖకు చేరుకుంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు