సెప్టెంబర్ లో జరిగే వేడుకల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైనవి. సెప్టెంబర్ 19న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజారోహణంతో ముగుస్తాయి. ప్రతీ సంవత్సరం ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. 



సెప్టెంబర్ లో జరగనున్న వేడుకల జాబిత
సెప్టెంబర్ 1 : అనంత పద్మనాభ వ్రతం
సెప్టెంబర్ 17 : మహాలయ అమావాస్య
సెప్టెంబర్ 18 :  శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ
సెప్టెంబర్ 19 : ధ్వజారోహణం
సెప్టెంబర్ 23 : శ్రీవారి గరుడసేవ
సెప్టెంబర్ 26  : రథోత్సవం
సెప్టెంబర్ 27 : శ్రీ వారి చక్రస్నానం, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాల ముగుస్తాయి.
సెప్టెంబర్ 28 : శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం