AP Elections Survey: జీ న్యూస్ సర్వేలో అధికారం ఎవరిదంటే..? వైసీపీ, టీడీపీ-జనసేన కూటమికి సీట్లు ఇవే..!
Zee Telugu News Survey On AP Elections: ఏపీ ఎన్నికల్లో విజయం ఏ పార్టీది..? వైఎస్సార్సీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందా..? టీడీపీ-జనసేన కూటమి జగన్ సర్కారుకు షాకిస్తుందా..? ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది..? జీ తెలుగు న్యూస్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సర్వే లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
Zee Telugu News Survey On AP Elections: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. రెండో సారి అధికారం కోసం వైసీపీ.. జగన్ ను ఓడించేందుకు టీడీపీ పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన సీఎం జగన్... ఈసారి వైనాట్ 175 స్లోగన్ తో జనంలోకి వెళుతున్నారు. జగన్ ను గద్దె దింపడమే లక్ష్యంగా జనసేనతో జతకట్టిన తెలుగుదేశం పార్టీ.. అధికారం కోసం పావులు కదుపుతోంది. టీడీపీ,జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందనే ప్రచారం సాగుతోంది. టీడీపీ-జనసేనకు బీజేపీ తోడైతే ఫలితాలు మరోలా ఉంటాయనే టాక్ వస్తోంది. జీన్యూస్ ఒపీనియన్ పోల్ సర్వేలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విభిన్న ఫలితాలు వచ్చాయి. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు గెలుస్తారనే అంశంతో పాటు జగన్ పాలన, ప్రతిపక్ష నేత చంద్రబాబు పాత్రపైనా ఓటర్ల పల్స్ తెలుసుకుంది జీ న్యూస్. జీ న్యూస్-మ్యాట్రిజ్ సంస్థ పోల్ సర్వే లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
Andhra Pradesh Assembly Elections 2024:
10. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సీట్లలో మార్పు
==> YSRCP -39
==> టీడీపీ-జనసేన +39
==> కాంగ్రెస్ 0
==> బీజేపీ 0
==> ఇతరులు 0
Andhra Pradesh Assembly Elections 2024:
9. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతంలో మార్పు
==> YSRCP -1.8
==> టీడీపీ-జనసేన +2.4
==> కాంగ్రెస్ -0.1
==> బీజేపీ +0.2
==> ఇతరులు -0.7
Andhra Pradesh Assembly Elections 2024:
8. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు
==> YSRCP 112
==> టీడీపీ-జనసేన 63
==> కాంగ్రెస్ 00
==> బీజేపీ 00
==> ఇతరులు 00Andhra Pradesh Assembly Elections 2024:
7. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,జనసేన.. బీజేపీతో కలిస్తే
==> YSRCP 48.8%
==> టీడీపీ-జనసేన+ BJP 48.8%
==> కాంగ్రెస్ 1.1%
==> ఇతరులు 1.3%Andhra Pradesh Assembly Elections 2024:
6. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు?
==> YSRCP 48.8%
==> టీడీపీ-జనసేన 47.7%
==> కాంగ్రెస్ 1.1%
==> బీజేపీ 1.1%
==> ఇతరులు 1.3%Andhra Pradesh Assembly Elections 2024:
5. ఏ ముఖ్యమంత్రి పాలన బాగుందని భావిస్తున్నారు?
==> వైఎస్ జగన్ 29 శాతం
==> చంద్రబాబు 22 శాతం
==> వైఎస్ రాజశేఖర్ రెడ్డి 41 శాతం
==> ఇతరులు 8 శాతంAndhra Pradesh Assembly Elections 2024:
4. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అంశాన్ని చూసి ఓటేస్తారు ?
==> రాష్ట్ర ప్రభుత్వ పనితీరు 23 శాతం
==> ఎమ్మెల్యేల పనితీరు 19 శాతం
==> సీఎం క్యాండిడేట్ 21 శాతం
==> మ్యానిఫెస్టో 9 శాతం
==> నిత్యావసరాల ధరలు 6 శాతం
==> స్థానిక సమస్యలు 16 శాతం
==> ఇతర సమస్యలు 6 శాతంAndhra Pradesh Assembly Elections 2024:
3. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం ఎంత ?==> చాలా ఎక్కువ 31 శాతం
==> కొంత వరకు 26 శాతం
==> ఉండదు 28 శాతం
==> ఇప్పుడే చెప్పలేం 15 శాతం
Andhra Pradesh Assembly Elections 2024:
2.ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ పాత్రపై మీ అభిప్రాయం?
==> చాలా బాగుంది 24 శాతం
==> ఫర్వాలేదు 34 శాతం
==> అస్సలు బాగాలేదు 40 శాతం
==> చెప్పలేం 2 శాతంజీన్యూస్, మ్యాట్రిజ్ సర్వేలో వెల్లడైన అంశాలను చూద్దాం..
Andhra Pradesh Assembly Elections 2024: 1.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరు ఎలా ఉంది?
==> చాలా బాగుంది 38 శాతం
==> ఫర్వాలేదు 26 శాతం
==> అస్సలు బాగాలేదు 34 శాతం
==> చెప్పలేం 2 శాతం