AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ ఫలితాల్లో ఉత్కంఠ.. మెజార్టీ సీట్లు ఎవరికంటే..?
AP Assembly and Lok Sabha Election 2024 Exit Poll Result Live: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా.. సర్వే సంస్థలు ప్రజల నాడిని వెల్లడించనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు..? ఎన్నికల్లో విజేతగా నిలిచేది ఎవరు..? ఎగ్జిట్ పోల్స్ లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
Andhra Pradesh Assembly and Lok Sabha Election 2024 Exit Poll Results Live: దేశవ్యాప్తంగా ఓట్ల పండగ చివరి దశకు చేరుకుంది. నేడు చివరి దశ పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక అంతకుముందే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇవాళ సాయంత్రం 6.30 గంటల నుంచి వివిధ సంస్థలు తాము నిర్వహించిన సర్వేల రిజల్ట్స్‌ను వెల్లడించనున్నాయి. దేశంలో మరోసారి బీజేపీ హవా కొనసాగుతుందా..? ఏపీలో వైఎస్సార్సీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా..? టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సత్తా చాటుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఏపీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
AP Exit Poll Live: ఏపీ లోక్‌సభ ఎగ్జిట్‌పోల్స్: CNN News 18: వైసీపీ 5-8, ఎన్డీఏ 19-22.. News X: వైసీపీ 3, ఎన్డీఏ 22.. NDTV: వైసీపీ 7, ఎన్డీఏ 18, ఆరా: వైసీపీ 13-15, ఎన్డీఏ 10-12, ABP-C ఓటర్: వైసీపీ 0-4, ఎన్డీఏ 21-15
AP Exit Poll Live: టైమ్ నౌ ఈటీజీ సర్వేలో వైసీపీ 13 నుంచి 15 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. టీడీపీ 7-9, బీజేపీ-2, జనసేన ఒక స్థానంలో గెలుపొందుతుందని వెల్లడించింది.
AP Exit Poll Live: ఏపీలో వైఎస్సార్‌సీపీ 124 నుంచి 128 గెలుచుకుంటుందని అగ్నివీర్ సర్వే వెల్లడించింది. టీడీపీ 46 నుంచి 49 సీట్లలో విజయం సాధిస్తుందని తేల్చింది.
AP Exit Poll Live: చాణక్య పార్థదాస్ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని తేలింది. టీడీపీకి 55 నుంచి 65 సీట్లు వస్తాయని వెల్లడించింది.
AP Exit Poll Live: రిపబ్లిక్ టీవీ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. ఎన్డీఏ కూటమికి 353 నుంచి 368 సీట్లు, ఇండియా కూటమికి 118-133, ఇతరులకు 43 నుంచి 48 స్థానాలు దక్కనున్నట్లు అంచనా వేస్తోంది. అలాగే పీఎంఏఆర్‌క్యూ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఎన్డీఏ 359, ఇండియా కూటమికి 154, ఇతరులు 30 సీట్లు వస్తాయని తెలిపింది. దీని ప్రకారం ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీ దక్కనున్నట్లు తెలిపింది.
AP Exit Poll Live: NDTV: ఎన్డీఏ 365, ఇండియా కూటమి 142, ఇతరులు 36... న్యూస్ నేషన్: ఎన్డీఏ 342-378, ఇండియా కూటమి 153-169
AP Exit Poll Live: పోల్ స్ట్రాటజీ గ్రూప్: YSRCP- 115-125, TDP- 50-60
AP Exit Poll Live: ABP-C Voter: వైసీపీ 97-108, టీడీపీ కూటమి 67-78.
AP Exit Poll Live: న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్: ఏపీలో వైసీపీ 5-8 లోక్‌సభ స్థానాలు, టీడీపీ కూటమి 19-22 లోక్‌సభ స్థానాలు, తెలంగాణలో కాంగ్రెస్ 5-8, బీజేపీ 7-10, బీఆర్ఎస్ 2-5 లోక్‌సభ స్థానాలు
AP Exit Poll Results 2024 Live: ఆరా ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి 98-104 అసెంబ్లీ స్థానాల్లో విజయం, టీడీపీ కూటమికి 71-81 స్థానాలు
AP Exit Poll Results 2024 Live: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై జన్‌మాత్ పోల్స్ ఫలితాలు ఇవే..
==> YSRCP - 95-103
==> టీడీపీ పొత్తు – 67-75
తుది అంచనా వేసిన ఓట్ షేర్
==> YSRCP - 51%
==> టీడీపీ పొత్తు – 45%
==> కాంగ్రెస్ + - 2%
==> ఇతరులు – 2 %
AP Exit Poll Results 2024 Live: ఏపీలో కూటమికే పట్టం కట్టింది కేకే సర్వే. కూటమి దెబ్బకు ఫ్యాన్ అవుట్ అంటూ ప్రకటించింది. 25 ఎంపీ సీట్లలో 25 కూటమికే దక్కనున్నట్లు తెలిపింది. అసెంబ్లీ విషయంలో కూటమికి 161 స్థానాలు దక్కనున్నట్లు తెలిపింది. వైసీపీకి 14 సీట్లు మాత్రమే రానున్నట్లు తెలిపింది.
AP Exit Poll Live: చాణక్య స్ట్రాటజీస్ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఏపీలో కూటమికి అధికారం దక్కబోతుందని తేలింది. ఓవరాల్‌గా కూటమికి 114 నుంచి 125 సీట్లు లభిస్తాయని తెలిపింది. అలాగే వైసీపీకి 39 నుంచి 49 సీట్లు, ఇతరులకు ఒక స్థానం దక్కనున్నట్లు తెలిపింది. ఎంపీ సీట్లలోనూ 17 నుంచి 18 సీట్లు కూటమికి, 6 నుంచి ఏడు సీట్లు వైసీపీకి దక్కనున్నట్లు పేర్కొంది.
AP Exit Poll Results 2024 Live: NDA కూటమికి 359 సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ- PMARQ సర్వే వెల్లడించింది. ఇండియా కూటమికి 154 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
AP Exit Poll Live: గతంలో ఎన్నడూ లేనంత విధంగా దేశవ్యాప్తంగా ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న ఫలితాలను లైవ్‌లో బిగ్ స్క్రీన్‌పై ప్రసారం చేయబోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP Exit Poll Live: దేశవ్యాప్తంగా 57 స్థానాలకు పోలింగ్ ముగిసింది. కాసేపట్లో ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వే ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
AP Assembly Election Exit Polls Live Updates: మన దేశంలో ఎగ్జిట్‌పోల్స్ 1957 ఎన్నికల నుంచి మొదలయ్యాయి. అప్పట్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనే సంస్థ మొదట్లో సర్వేలు నిర్వహించింది. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
AP Assembly Election Exit Polls Live Updates: ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్‌లో ఎవరికి పట్టం కడతారో చూడాలి.