ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు; లైవ్ అప్ డేట్స్ మీ కోసం
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ తో పాటు ఏపీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరికొన్ని గంటల్లో దీని ఫలితాలు వెలువరించనున్నారు. దీంతో ఫలితాలపై ఇటు అభ్యర్థులు, అటు జనాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నాని కల్లా గెలుపు ఎవరిదనే విషయంపై క్లారిటీ రానుంది.
మధ్యాహ్నం 2 గంటల వరకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తియ్యే అవకాశముందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు అనంతరం ప్రతి నియెజకవర్గంలో 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. ఇలా ఈ ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రానికి కల్లా అధికారికంగా ఫలితాలు వెలవడించనున్నారు.
కౌంటింగ్ కోసం రాష్ట్రంలో మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాల్లో సుమారు 350 లెక్కింపు హాళ్లు ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక పరిశీలకుడు...పార్లమెంట్ స్థానానికి మరో పరిశీలకుడిని ఎన్నికల సంఘం నియమించింది.
Latest Updates
జనసేనకు ఊరట; గాజువాకలో కోలుకున్న పవన్ కల్యాణ్
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కోలుకున్నారు. విశాఖపట్నంలోని గాజువాకలో ఆధిక్యం చూపుతున్నారు. తొలి రౌండ్లలో వెనుకంజలో ఉన్న జనసేనాని..ఒక్కసారిగా మళ్లీ పుంజుకున్నారు. అయితే భీమవరంలో మాత్రం మూడో స్థానంలో నిలవడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పవన్ కల్యాన్ భీమవరంతో పాటు గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేశారు. గాజువాక పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంటే భీమవరం పరిస్థితి దారుణ స్థితిలో ఉంది.
మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్లున్న వైసీపీ
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నాల్గో రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ కంటే వైసీపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం వైసీపీ 129 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. టీడీపీ 22 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా పరిణమంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. భారీ విజయం సొంతం చేసుకుంటామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామం టీడీపీ శ్రేణుల్లో కాస్త నిరాశను మిగిల్చింది. అయితే అన్ని రౌండ్లు పూర్తయ్యే లోపు పుంజుకుంటామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు
తొలుత వెనుకంజ..మళ్లీ పుంజుకున్న చంద్రబాబు
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాల్గో రౌండ్ ముగిసే సమయానికి ఏపీ సీఎం చంద్రబాబు 15 00 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో చంద్రబాబు 67 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. అయితే రెండు , మూడు, నాలుగు రౌండ్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించిన చంద్రబాబు మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసే సమయానికి కనీసం 70 వేల ఓట్ల ఆధిక్యం వస్తుందని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేశారు. అంత సీన్ లేదని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు.
ఆధిక్యంలో వైసీపీ...
ఉదయం 9 గంటకు వరకు ఏపీలో మొత్తం 55 నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిక్యంలో కొసాగతుండగా..టీడీపీ 12 నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజా పరిణామంతో వైసీపీ నేతల్లో ఉత్సాహం నెలకొందిచంద్రబాబు, జగన్ నివాసాల వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ నివాసాల వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేశారు. వీరిద్దరి నివాసాల వద్ద రెండేసి కంపెనీలు పహరా కాస్తున్నాయి. వీరికి అదనంగా స్థానిక పోలీసులు 50 మంది చొప్పున భద్రత విధుల్లో ఉంటారు. పార్టీ అభ్యర్థులు, నేతలు తమ పార్టీ గెలుపొందిన వెంటనే నేరుగా పార్టీ అధినేతల ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఆయా పార్టీలకు చెందిన నేతలు తరలివస్తే వారందరిని నియంత్రించటం స్ధానిక పోలీసులకు కష్టమవుతుంది.. ఈ నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు.భీమవరంలో పవన్ కల్యాణ్ వెనుకంజ
ఏపీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు అందించిన సమాచారం ప్రకారం భీమవరం నుంచి పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్ధి వైసీపీ అభ్యర్ధి 625 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జససేన చీఫ్ పోటీ చేసిన మరో నియోజకవర్గం గాజు వాకలోనూ వెనుకంజలో ఉన్నారు. తాజా పరిణామంతో జనసైనికుల్లో కాస్త నిరాశ నెలకొంది. అయితే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయే సరికి పవన్ కల్యాణ్ పుంజుకుంటారని జనసేన కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు