AP ASSEMBLY LIVE UPDATES: శాసనమండలిలో ఫైటింగ్ సీన్.. నారా లోకేష్ పైకి దూసుకెళ్లిన దువ్వాడ..
AP ASSEMBLY LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మూడవ రోజు సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
AP ASSEMBLY LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మూడవ రోజు సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అయినా ప్రశ్నోత్తరాలు చేపట్టారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సభకు వచ్చే ముందు నిరసన తెలిపారు టీడీపీ సభ్యులు. ఎడ్ల బండితో ర్యాలీగా ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎడ్లను తమతో తీసుకెళ్లారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు కాడెద్దులుగా మారి బండిని లాగారు. ఎమ్మెల్సీ నారా లోకేష్ ఎడ్ల బండి లాగారు.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్ డేట్స్..
Latest Updates
ఏపీ అసెంబ్లీలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ జరిగింది. చర్చలో మాట్లాడిన సీం జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఏపీలో నీచమైన రాజకీయం నడుస్తోందన్నారు. కేంద్ర సర్కార్ ఏపీ బల్క్ డ్రగ్ పార్కు ఇస్తే టీడీపీ అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు సీఎం జగన్. బల్క్ డ్రగ్ పార్కు కోసం 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయన్నారు. 30 వేల ఉద్యోగాలు వచ్చే సంస్థను అడ్డుకోవాలని చూశారంటే చంద్రబాబును ఏమనాలో అర్ధం కావడం లేదన్నారు సీఎం జగన్. దుష్టచతుష్టయంతో ఏపీకి తీరని నష్టం జరుగుతుందని అన్నారు.
శాసనమండలిలో వైసీపీ-టీడీపీ సభ్యుల మాటల యుద్దం
ఆరోగ్య శాఖపై చర్చలో టీడీపీ సభ్యుల ప్రశ్నలు
క్రిమినల్స్ అంటూ విమర్శలు చేసుకున్న వైసీపీ, టీడీపీ ఎమ్మెల్సీలు
టీడీపీ సభ్యుల వైపు దూసుకెళ్లిన ఎమ్మెల్సీ దువ్వాడ
ఆపిన వైసీపీ ఎమ్మెల్సీలు.. క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి
కోలగట్లను అభినందించిన సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని
కోన రఘుపతి రాజీనామా చేయడంతో డిప్యూటీ స్పీకర్ గా కోలగట్లు ఎన్నిక
పోలవరం నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. సభలో టీడీపీ సభ్యులు అసత్యాలు మాట్లాడుతున్నారని అన్నారు. అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు అంబటి. పోలవరం ప్రాజెక్టును చంద్రాబాబు టీఎంగా మార్చుకున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు
ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు అన్ ఫిట్- జగన్
అప్రోచ్ ఛానెల్ కట్టకుండానే కాఫర్ డ్యామ్ కడతరా..
చంద్రబాబు నిర్వాకం వల్లే పోలవరం ఆలస్యం- జగన్
పోలవరం పరిహారంపై సభలో వాడివేడీ చర్చ
10 లక్షల సాయం ఏమైందని ప్రశ్నించిన టీడీపీ
ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నామన్న సీఎం జగన్
నిర్వాసితులందరిని ఆదుకుంటాం- జగన్