AP Assembly Live Updates:సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా! మూడు రాజధానులే లక్ష్యమన్న జగన్
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. ఈ సమావేశాల్లో జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తొలి రోజే అసెంబ్లీలో రచ్చ సాగింది. పాలనా వికేంద్రీకరణపై స్వల్ప కాలిక చర్చ చేపట్టింది ప్రభుత్వం. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేసేందుకు మూడు రాజధానులను ప్రతిపాదించామని వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో 16 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి లైవ్ అప్ డేట్స్ ...
Latest Updates
అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. వికేంద్రీకరణపై చంద్రబాబు అడ్డగోలు వాదన చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో గత 75 ఏళ్లలో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తే, తాము 13 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పారు. వికేంద్రీకరణ అంటే ఇదేనని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎన్ని మంచి ఫలితాలు ఉన్నాయో గోదావరి వరదల సమయంలో తెలిసిందన్నారు, అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి వరదల నుంచి ప్రజలను కాపాడాయని జగన్ చెప్పారు. ఏ ఒక్క కుటుంబం కూడా తమకు వరద సాయం అందలేదని చెప్పలేదన్నారు. అమరావతిలో బినామీల కోసం విశాఖ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదనిన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే విజయవాడలో అభివృద్ధి జరుగుతోందన్నారు జగన్. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని చంద్రబాబు తనకు లేఖ రాశారని తెలిపారు జగన్. సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏం గాడిదలు కాస్తున్నారంటూ మండిపడ్డారు. కుప్పం ప్రజలు ఒత్తిడితో రెవెన్యూ డివిజన్ పై చంద్రబాబును తనను అడక్క తప్పలేదన్నారు జగన్.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన
సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
అమరావతి కొందరి చేతుల్లోనే ఉందని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన బుగ్గన... టీడీపీ, చంద్రబాబు విధానాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టినవి అన్ని టెంపరరీ నిర్మాణాలే అన్నారు. రాజధానిలోకి 30 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాలు కేవలం 00 మంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్‌మెంట్ పార్టీ అన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్యలో మాట్లాడారు మాజీ మంత్రి కొడాలి నాని. మూడు ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఇందు కోసమే పరిపాలన వికేంద్రకరణకు జగన్ ప్రతిపాదించారని తెలిపారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదన్నారు నాని. అందరికి సమ న్యాయం చేయాలని చూస్తున్న సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.స్వార్థం కోసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు.
ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ
మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ ప్రివిలేజ్ మోషన్
మంత్రి కులం పేరుతో దూషించారన్న టీడీపీ సభ్యులు
మంత్రి మేరుగకు అండగా నిలిచిన ఇతర మంత్రులు
టీడీపీ సభ్యులే నాగార్జునను రెచ్చగొట్టారు- అంబటి
ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ
మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ ప్రివిలేజ్ మోషన్
మంత్రి కులం పేరుతో దూషించారన్న టీడీపీ సభ్యులు
మంత్రి మేరుగకు అండగా నిలిచిన ఇతర మంత్రులు
టీడీపీ సభ్యులే నాగార్జునను రెచ్చగొట్టారు- అంబటి
బీఏసీ సమావేశంలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సభ జరిగేందుకు సహకరించాలని టీడీపీ సభ్యులకు సూచన
అన్ని అంశాల పై చర్చిద్దామని హామీ ఇచ్చిన సీఎం జగన్
మీరు మాట్లడితే మా వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది..
సీఎంని అంటుంటే మా వాళ్లకు కోపం వస్తది కదా..
మీరు సంయవనం పాటించండి... మా వాళ్ళు మాట్లాడరు- జగన్
ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ
బీఏసీ సమావేశంలో నిర్ణయం
ఈనెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత
2.30 లక్షల ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ యత్నం
వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, టీఎస్‍ఎస్‍ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‍గోపాల్ అరెస్ట్
పోలీసులకు, తెలుగు యువత కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట
తెలుగు యువత కార్యకర్తలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేసిన పోలీసులు
ఉద్యోగాల కల్పనపై చర్చకు టీడీపీ సభ్యుల పట్టు
టీడీపీ సభ్యుల ఆందోళనతో అసెంబ్లీ కాసేపు వాయిదా
టీడీపీ తీరుపై మండిపడిన మంత్రి రోజా
ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత లేదు- రోజా
లక్షా 20 వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం- రోజా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే హాట్ హాట్ గా సాగాయి. సభ మొదలైన వెంటనే ఉద్యోగ కల్పనపై చర్చించాలంటూ వాయిదా తీరాన్మం ఇచ్చారు. టీడీపీ వాయిదా తీర్మాణాన్ని స్పీకర్ తిరస్కరించారు.దీంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జాబ్ లెస్ క్యాలెండర్ అంటూ నినాదాలు చేశారు. వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టినా.. ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
మొదట ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్
టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు
ఏపీ ప్రజలను మోసం చేసేందుకే మూడు రాజధానుల బిల్లు పెడతామంటున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు.రాజధానిపై ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఆ తీర్పుపై ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లలేదన్నారు. ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్న మంత్రులు, వైసీపీ నేతలపై ప్రతిపక్షం పోలీసులకు ఫిర్యాదు చేయాలని రఘురామ సూచించారు.
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు పెడితే.. అసెంబ్లీ రద్దుకు డిమాండ్ చేయాలని టీడీపీ నిర్ణయించింది.
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు పెడితే.. అసెంబ్లీ రద్దుకు డిమాండ్ చేయాలని టీడీపీ నిర్ణయించింది.