Visakhapatnam Rains Live: హై అలర్ట్.. ఏపీని మళ్లీ వణికిస్తున్న వరుణుడు.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
AP Rains Live Updates: కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల ప్రజు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP Rains Live Updates: ఏపీకి మరో ముప్పు ముంచుకోస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్తా రేపటికి పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండంగా మారనుంది. దీంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే వరదలతో విజయవాడ అతలాకుతలం అవ్వగా.. మరోసారి పొంచి ముప్పు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షానికి సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
Andhra Pradhesh Weather Live News: పశ్చిమ-మధ్య, పరిసర వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు ఉదయం(సెప్టెంబర్ 8న ) 08.30 గం.లకు అదే ప్రాంతంలో కళింగ పట్నంకు(ఆంధ్రప్రదేశ్ )తూర్పున 280 కి. మీ., గోపాలపూర్ కు (ఒడిశా ) తూర్పు -ఆగ్నేయ దిశలో 230 కి. మీ.దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా-పశ్చిమ తీరం వైపు కదులుతూ బలపడి రాబోయే 24 గం.లలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తరువాత ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా, పరిసర పశ్చిమ బెంగాల్ తీరాన్ని పూరి, దిఘా మధ్యలో 9వ తేది సాయంత్రం/రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 2 రోజులలో ఒడిశా, పరిసర గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉంది.
Andhra Pradhesh Weather Live News: కృష్ణా జిల్లా మచిలీపట్నం
రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు బందరు మండలం రుద్రవరం, గుండు పాలెం, నెలకుర్రు, చిన్నాపురం, భోగిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
Andhra Pradhesh Weather Live News: ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
==> నందిగామ నియోజకవర్గంలో మున్నేరు వరద భారీగా కొనసాగుతోంది...
==> పైన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి...
==> నందిగామ మండలం, కంచికచర్ల మండలంలో మున్నేరు నుంచి 42 క్యూసెక్కుల వరద కృష్ణానదిలో కలుస్తుంది...
==> నందిగామ నియోజకవర్గంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.