Vizag Garjana Live Updates: పవన్ కు వైజాగ్ అమ్మాయి కావాలి.. కాని రాజధాని వద్దా? మంత్రి రోజా పవర్ పంచ్

Sat, 15 Oct 2022-3:50 pm,

Vizag Garjana Live Updates: ఉత్తరాంధ్ర ఉడికిపోతోంది. రాజధానులపై పోటాపోటీ ఉద్యమాలతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న కొద్ది టెన్షన్ వాతావరణం పెరిగిపోతోంది.

Vizag Garjana Live Updates:   ఉత్తరాంధ్ర ఉడికిపోతోంది. రాజధానులపై పోటాపోటీ ఉద్యమాలతో విశాఖలో ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న కొద్ది టెన్షన్ వాతావరణం పెరిగిపోతోంది. మూడు రాజధానుల నినాదంతో దూకుడు పెంచిది వైసీపీ. అమరావతి రైతుల పాదయాత్రకు కౌంటర్ గా విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మన విశాఖ – మన రాజధాని అనే నినాదంతో భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యమంటూ  జేఏసీ విశాఖ గర్జనకు వైసీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. టీడీపీ కూడా విశాఖలో సేవ్ ఉత్తరాంధ్ర సదస్సు తలపెట్టింది. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనుంది. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్ర నేతలతో చర్చలు జరపనున్నారు. ఇలా మూడు పార్టీల పోటాపోటీ సభలతో వైజాగ్ హాట్ సెంటర్ గా మారింది.

Latest Updates

  • జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు జనసేన కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికార  జన సైనికులు, వీర మహిళలు.థింసా నృత్యం, తప్పెటగుళ్ళు, కోలాటం లాంటి సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలతో కోలాహలంగా మారింది విశాఖ విమానాశ్రయ ప్రాంగణం.

  • సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో విశాఖలో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    వైసీపీ పాలనలో విశాఖ నుంచి పరిశ్రమలు తరలిపోయాయి- టీడీపీ

    విశాఖలో భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు- టీడీపీ

    సీఎం జగన్ కు విశాఖ మీద ప్రేమ లేదు.. ఆస్తులు కొల్లగొట్టడమే లక్ష్యం- టీడీపీ

  • ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం చంద్రబాబు, పవన్ కు ఇష్టం లేదు- రోజా

    పవన్ కల్యాణ్ కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి.. షూటింగులు చేసుకోవడానికి.. ఆయన సినిమా కలెక్షన్లకు విశాఖ కావాలి.. చివరకు ఆయన పోటీ చేయడానికి విశాఖలోని గాజువాక కావాలి... కాని వైజాగ్ పరిపాలన రాజధానిగా మాత్రం వద్దా- రోజా

  • తుప్పుపట్టిన సైకిల్ చక్రాలు ఏపీని ముక్కలు చెక్కలు చేసింది

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    రాయలసీమ ,ఉత్తరాంధ్ర ప్రజల గొంతు కోశారు- రోజా

    ఆంధ్రప్రదేశ్ ద్రోహులు చంద్రబాబు, పవన్ - రోజా

    రాయలసీమ గడ్డపై పుట్టిన నేను సీమకు మద్దతు ఇస్తున్నా- రోజా

  • పెట్టుబడిదారుల వ్యాపారం కోసమే అమరావతి నినాదం- నాని
    తాము కొన్నభూముల విలువ పెంచుకోవడమే  టీడీపీ లక్ష్యం- నాని
    పదవి, కుమారుడు మాత్రమే చంద్రబాబుకు కావాలి- కొడాలి నాని

     

  •  చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధే కావాలి- రోజా
     మేం అందరి అభివృద్ధిని కోరుకుంటున్నాం- రోజా
     మేం చేసేది ప్రజా పోరాటం- రోజా
      చంద్రబాబు చేసేది రియల్‌ ఎస్టేట్‌ పోరాటం- రోజా

  • భారీ వర్షంలోనే కొనసాగుతున్న విశాఖ గర్జన

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు

    వైఎస్సార్ విగ్రహం వరకు కొనసాగనున్న ర్యాలీ

  • విశాఖలో ప్రారంభమైన జేఏసీ ర్యాలీ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    భారీగా తరలివచ్చిన ప్రజలు

    ర్యాలీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

     

     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link