Cyclone Asani Updates: అసని తుపాన్ లేటెస్ట్ అప్‌డేట్స్... ఇప్పటివరకూ ఐదుసార్లు దిశ మార్చుకున్న తుఫాన్..
Cyclone Asani Effect Updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటి (మే 10) వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Cyclone Asani Updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా 25 కిమీ వేగంతో అక్షాంశం 15.0°N మరియు రేఖాంశం 82.5°E లో కాకినాడకు దక్షిణ-ఆగ్నేయంలో 210 కి.మీ దూరంలో కదులుతోంది. దక్షిణ-నైరుతి దిశలో 310 కి.మీ మరియు విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), గోపాల్పూర్ (ఒడిశా)కి నైరుతి దిశలో 530 కి.మీ మరియు 630 కి.మీ దూరంలో తుఫాన్ కదులుతోంది.
Latest Updates
ఏపీలోని మచిలీపట్నంకు 50 కి.మీ దూరంలో.. నర్సాపూర్‌కు దక్షిణ నైరుతి దిశగా 30 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన అసని తుఫాన్...
'అసని' తుఫానుపై జీ న్యూస్ ఎడిటర్ భరత్ కుమార్ సమగ్ర విశ్లేషణ :
విజయవాడ.. పలు విమాన సర్వీసులు రద్దు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులు రద్దు
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రధాన సర్వీసులు రద్దుచేసినట్లు ఇండిగో ప్రకటన
విశాఖ, రాజమహేంద్రవరం, కడపకు నడిచే లింక్ సర్వీసులు నిలుపుదల
వాతావరణ మార్పుల అనంతరం సర్వీసులు పునరుద్ధరిస్తామన్న ఇండిగో
తుపాను దృష్ట్యా ఇవాళ విశాఖ నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు
రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులన్నీ రద్దు
హైదరాబాద్, బెంగళూరు, విశాఖ నుంచి 9 విమానాలు రద్దు చేసిన అధికారులు
అసని తుఫాను... ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి:
అసని తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రకృత్తి విపత్తు బారినపడేవారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. చాలా గ్రామాల్లో ధాన్యం కల్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఇప్పటివరకు ఐదు సార్లు దిశ మార్చుకుని కొనసాగుతున్న తుఫాన్...
ఈ మధ్యాహ్నం ఆ జిల్లాలో బలమైన ఈదురు గాలులు
ఈరోజు, రేపు తుఫాను ప్రభావంతో కృష్ణా, గుంటూరు, తూ.గో, ప.గో, విశాఖ, విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి విశాఖ తూగో, పగో కృష్ణ జిల్లాల్లోబలమైన ఈదురు గాలులు.
వాయుగుండంగా బలహీనపడనున్న తుఫాన్ :
బంగాళాఖాతంలో నుంచి కృష్ణ -పశ్చిమ గోదావరి జిల్లా మధ్య భూభాగంలోకి ప్రవేశించిన 'అసని'. అక్కడి నుంచి ఈశాన్య దిశగా ప్రయాణం చేసి ఈ మధ్యాహ్నం
12 గంటల సమయంలో కాకినాడకు సమీపంలో తిరిగి బంగాళా ఖాతం లోకి ప్రవేశిస్తుంది. కాకినాడ కళింగపట్నం తీరం మధ్య తుఫాను పయనించి రేపు ఉదయం వాయుగుండంగా బలహీనపడు తుంది.ఏపీలో భారీ వర్షాలు :
గజపతినగరం (జిల్లా విజయనగరం) 4, వేపాడ (విజయనగరం జిల్లా) 4 సెం.మీ, తెర్లాం
(జిల్లా విజయనగరం) 4 సెం.మీ, నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) 4 సెం.మీ, అనకాపల్లి (విశాఖపట్నం జిల్లా) 4 సెం.మీ,
అద్దంకి (ప్రకాశం జిల్లా) 4 సెం.మీ, గరుగుబిల్లి (విజయనగరం జిల్లా) 3 సెం.మీ, మర్రిపూడి (ప్రకాశం జిల్లా) 3,
ముండ్లమూరు (ప్రకాశం జిల్లా) 3, చీమకుర్తి (ప్రకాశం జిల్లా) 3 సెం.మీ, దర్శి (ప్రకాశం జిల్లా) 3,
చోడవరం (విశాఖపట్నం జిల్లా) 3, కొనకనమిట్ల (ప్రకాశం జిల్లా) 3 సెం.మీ, తడ (జిల్లా Spsr నెల్లూరు)
3 సెం.మీ, సీతానగరం (విజయనగరం జిల్లా) 3 సెం.మీ, టెక్కలి (శ్రీకాకుళం జిల్లా) 3 సెం.మీ, వెంకటగిరి (జిల్లా Spsr నెల్లూరు)
3 సెం.మీ, నందిగామ(ఆర్గ్) (కృష్ణా జిల్లా) 3, చీపురుపల్లె (విజయనగరం జిల్లా) 3 సెం.మీ, సాలూరు (విజయనగరం జిల్లా)
3 సెం.మీ, సోంపేట (శ్రీకాకుళం జిల్లా) 3, మెరకముడిదాం (విజయనగరం జిల్లా) 3 సెం.మీ, పార్వతీపురం (జిల్లా)
విజయనగరం) 3 సెం.మీ వర్షపాతం నమోదైంది.ఏపీలో భారీ వర్షాలు :
పూసపాటిరేగ (విజయనగరం జిల్లా) 7 సెం.మీ, గంట్యాడ (విజయనగరం జిల్లా) 7 సెం.మీ, పలాస (జిల్లా)
శ్రీకాకుళం) 6 సెం.మీ, బొండపల్లె (విజయనగరం జిల్లా) 6 సెం.మీ, ఒంగోలు (ప్రకాశం జిల్లా) 5 సెం.మీ, శృంగవరపుకోట
(జిల్లా విజయనగరం) 5 సెం.మీ, విజయనగరం (జిల్లా విజయనగరం) 5 సెం.మీ, యలమంచిలి (విశాఖపట్నం జిల్లా) 5 సెం.మీ,
తుని (తూర్పు గోదావరి జిల్లా) 5 సెం.మీ, విశాఖపట్నం Ap (విశాఖపట్నం జిల్లా) 5 సెం.మీ, మందస (జిల్లా)
శ్రీకాకుళం 5 సెం.మీ, డెంకాడ (విజయనగరం జిల్లా) 5 సెం.మీ, పొదిలి (ప్రకాశం జిల్లా) 4సెం.మీ, బాలాజీపేట (జిల్లా)
విజయనగరం) 4 సెం.మీ, కారంచేడు (ప్రకాశం జిల్లా) 4, బొబ్బిలి (విజయనగరం జిల్లా) 4 సెం.మీ, రణస్థలం (జిల్లా)
శ్రీకాకుళం) 4 సెం.మీ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలు :
అసని తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాతావరణ శాఖ ప్రకారం బుధవారం ఉదయం 8.30 గంటల వరకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, నెల్లూరు జిల్లా కావలి, ప్రకాశం జిల్లా కందుకూరు, బాపట్ల జిల్లా గుంటూరులో 7 సెం.మీ వర్షపాతం నమోదైంది.
విశాఖకు పలు విమాన సర్వీసుల రద్దు
అసని తుఫాన్ ప్రభావంతో విశాఖకు పలు విమాన సర్వీసుల రాకపోకలు రద్దయ్యాయి. విశాఖకు రాకపోకలు సాగించే అన్ని విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. బెంగళూరు, ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఏసియా ప్రకటించింది. స్పైస్ జెట్ విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. వాతావరణం అనుకూలిస్తే సాయంత్రం నుంచి కొన్ని విమాన సర్వీసుల పున:ప్రారంభం కానున్నాయి.
ఈరోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం
రేపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం
కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయి.-ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రస్తుతం మచిలీపట్నంకు 50 కి.మీ. దూరంలో, కాకినాడకు 150 కి.మీ. దూరంలో, విశాఖపట్నంకు 310 కి.మీ. గోపాలపూర్ కు 530 కి.మీ., పూరీకు 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాను...
కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం...
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసని సైక్లోన్ ఉధృతి దృష్ట్యా కాకినాడ బీచ్ రోడ్ నుండి ఉప్పాడ గ్రామం వరకు ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. తుఫాన్ ప్రభావిత గ్రామాలైన సుర్యారావుపేట, నేమాం, ఉప్పాడ గ్రామాల్లో ఆయన పర్యటించారు. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉన్నందునా... తీర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించాలని ఆదేశాలిచ్చారు.
గురువారం (మే 12) ఉదయం నాటికి తుఫాన్ వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ శాఖ ప్రకారం.. అసని తుఫాన్ మరికొద్ది గంటల పాటు వాయువ్య దిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా మచిలీపట్నం, యానాం, నర్సాపూర్, కాకినాడ, తుని, విశాఖపట్నం తీర ప్రాంతాల మీదుగా ఈరోజు సాయంత్రానికి బంగాళాఖాతానికి చేరనుంది.
ప్రస్తుతం మచిలీపట్నంకు ఆగ్నేయంగా 60కి.మీ దూరంలో, కాకినాడకు దక్షిణ నైరుతి దిశగా 180కి.మీ దూరంలో, విశాఖపట్నంకు నైరుతి దిశగా 310 కి.మీ దూరంలో, ఒడిశా గోపాల్‌పూర్ 550 కి.మీ దూరంలో, పూరికి 660 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖవెల్లడించింది.
. ప్రస్తుతం మచిలీపట్నంకు ఆగ్నేయంగా 60కి.మీ దూరంలో, కాకినాడకు దక్షిణ నైరుతి దిశగా 180కి.మీ దూరంలో, విశాఖపట్నంకు నైరుతి దిశగా 310 కి.మీ దూరంలో, ఒడిశా గోపాల్‌పూర్ 550 కి.మీ దూరంలో, పూరికి 660 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖవెల్లడించింది.
'అసని' తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడినట్లు వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్టులో వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తుఫాన్ కదిలినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
9:06PM Cyclone Asani Live From AP: రానున్న ఇంకొన్ని గంటల్లో తుపాన్ వాయువ్య దిశగా కదిలి ఆంధ్రా తీరానికి దగ్గరిగా వస్తుందని రేపు బుధవారం ఉదయం తుపాన్ తన దిశ మార్చుకుని కాకినాడ వైపు పయణించి అక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. నిన్నటివరకు వాయువ్య దిశలో కదిలిన తుపాన్.. గడిచిన 6 గంటల నుంచి తన దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చిందన్నారు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తీరానికి తుపాన్ అతి సమీపంలోనే ఉన్నట్టు సునంద పేర్కొన్నారు. రేపు కాకినాడ - తూర్పు గోదావరి సమీపంలో తీరాన్ని తాకిన తర్వాత తీరానికి సమాంతరంగా విశాఖపట్నం తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్టు ఆమె వివరించారు.
Cyclone Asani Latest Updates: అసని తుపాన్ ఆంధ్రా తీరం వైపు వేగంగా కదులుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కి రెడ్ అలర్ట్ జారీ అయింది. బుధవారం ఉదయం పశ్చిమ బంగాళాఖాతంలో కాకినాడ లేదా విశాఖపట్నం సమీపంలో తుపాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత వాతావరణ శాఖకు చెందిన శాస్త్రవేత్త సంజీవ్ ద్వివేదీ ఈ వివరాలు వెల్లడించారు.
దిశ మార్చుకోవడంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
తుపాను గమనం దక్షిణ కోస్తావైపుకు కదలడంతో ప్రస్తుతం ఒంగోలు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. మచిలీపట్నం తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులు వీయనున్నాయి. తుపాను కారణంగా ఒంగోలు, అద్దంకి, మచిలీపట్నం, దివిసీమ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
Cyclone Asani live Updates: అసని తుఫాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Cyclone Asani live Updates: మే 10 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అసనీ తుపాను కారణంగా రానున్న మూడ్రోజుల పాటు ఉత్తర కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రేపు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పెనుగాలులు తీర ప్రాంతాల్లో గంటకు 75 కిలోమీటర్ల వరకూ వీయనున్నాయి. ఇక దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా పడనున్నాయి. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. తీర ప్రాంతాల్లో అయితే గంటకు 75 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయవచ్చు.
Cyclone Asani Effect On Telangana : తెలంగాణలో కొన్నిచోట్ల మే 10 నుండి12 వ తేదీ వరకు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలావుంటే, రేపు తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జయశంకర్ భూపాలపల్లి మరియు మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అసనీ తుపాను ఆంధ్ర, ఒడిశా తీరానికి మరింత చేరువవుతోంది. రాత్రికి ఉత్తరాంధ్ర తీరానికి చేరుకుని..రానున్న 24 గంటల్లో బలహీనపడనుంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అసనీ తుపాను కారణంగా రానున్న మూడ్రోజుల పాటు ఉత్తర కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రేపు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పెనుగాలులు తీర ప్రాంతాల్లో గంటకు 75 కిలోమీటర్ల వరకూ వీయనున్నాయి.
తెలంగాణలో కూడా అసనీ తుపాను ప్రభావంతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. రానున్న మూడ్రోజుల వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది.
అసనీ తుపాను ప్రభావం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో ఈదురుగాలులు వీస్తున్నాయి.
అసనీ తుపాను కారణంగా విశాఖ నుంచి నడిచే 23 ఇండిగో విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. మరోవైపు ఢిల్లీ నుంచి విశాఖపట్నం, బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లే ఎయిర్ ఏషియా విమానాలు కూడా రద్దయ్యాయి. ముంబై-రాయ్‌పూర్- విశాఖ, ఢిల్లీ- విశాఖపట్నం ఎయిర్ ఇండియా విమానాలు కూడా రద్దయ్యాయి.
"ఆసని తుపాను ప్రస్తుతం పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ప్రాంతం నుంచి నైరుతి వైపు కొనసాగుతుంది. ఇది విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 330 కి.మీ దూరంలో ఉంది. ఈ రాత్రికి అసని తుపాను మరింత తీవ్రంగా వాయువ్యంగా వైపు కదిలే అవకాశం ఉంది. ఆ తర్వాత తీరం దాటే అవకాశం ఉంది".
- కుమార్, డ్యూటీ ఆఫీసర్, తుఫాను హెచ్చరికల కేంద్రం, విశాఖపట్నం
విశాఖ లేదా విజయనగరంలో తీరం దాటనున్న అసనీ తుపాను
అసనీ తుపాను లేటెస్ట్ అప్ డేట్ విడుదలైంది. ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటవచ్చని అంచనా వేసినా..ఆ తరువాత దిశ మారినట్టు తెలుస్తోంది. అసనీ తుపాను ఎల్లుండ కాకినాడ మీదుగా విశాఖపట్నంవైపుకు మళ్లి..విశాఖ లేదా విజయనగరంలో అదే రోజు తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అలెర్ట్ ప్రకటించారు.
అసనీ తుపాను రేపటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే అసని తీవ్ర తుపానుగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది. ప్రస్తుతతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 5 వందల కిలోమీటర్లు, పూరీకి దక్షిణంగా 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరం దాటకుండానే రానున్న 48 గంటల్లో బలహీనపడే తుపాను ఇది.
ప్రస్తుతం తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న అసని తుఫాన్... బుధవారం నాటికి తుఫాన్‌గా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నెల 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం...
కార్ నికోబార్ (నికోబార్ దీవుల)కు పశ్చిమ వాయువ్యంగా 920 కి.మీ. దూరంలో .. పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ దీవుల)కు పశ్చిమ వాయువ్యంగా 770 కి.మీ. దూరంలో విశాఖపట్నంకు ఆగ్నేయంగా 450 కి.మీ, పూరీకి 650 కి.మీ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన తుఫాన్...
అసని తుఫాన్ విశాఖపట్నంకు ఆగ్నేయంగా 450 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మే 10 వరకు ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మే 10 నాటికి అసని తుఫాన్ బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే 11, 12 తేదీల్లో బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.
తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో నేటి అర్ధరాత్రి నుంచి గంటకు 105 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
అసని తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.