Konaseema District Protests Live Updates: కోనసీమ జిల్లా పేరు మార్పుతో భగ్గుమన్న అమలాపురం.. కోనసీమ అంతటా కర్ఫ్యూ

Wed, 25 May 2022-12:24 am,

Konaseema District Protests Live Updates:కోనసీమ జిల్లా పేరు మార్పు నిర్ణయంతో జిల్లా కేంద్రమైన అమలాపురం భగ్గుమంది. కోనసీమ జిల్లా పేరును డా బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడాన్ని తీవ్రంగా నిరసిస్తూ కొంత మంది యువకులు రోడ్డెక్కారు. వీరికి తోడు భారీ సంఖ్యలో జనం కలిసి రావడంతో జిల్లా పేరు మార్పిడికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

Konaseema District Protests Live Updates: కోనసీమ జిల్లా పేరు మార్పు నిర్ణయంతో జిల్లా కేంద్రమైన అమలాపురం భగ్గుమంది. కోనసీమ జిల్లా పేరును డా బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడాన్ని తీవ్రంగా నిరసిస్తూ కొంత మంది యువకులు రోడ్డెక్కారు. వీరికి తోడు భారీ సంఖ్యలో జనం కలిసి రావడంతో జిల్లా పేరు మార్పిడికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. భారీ సంఖ్యలో జనం నిరసన ర్యాలీలో పాల్గొనడంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చేసుకుంది. ఇంకొంతమంది నిరసనకారులు రెచ్చిపోయి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. 


అమలాపురంలో పరిస్థితిని సమీక్షించి ఆందోళనకారులను నిరోధించడానికి ఘటనా స్థలానికి వచ్చిన డా బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డిపై సైతం రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఎస్పీ సుబ్బారెడ్డి ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.

Latest Updates

  • Curfew in Konaseema District: కోనసీమ జిల్లాలో కర్ఫ్యూ:

    కోనసీమ జిల్లాలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా బుధవారం ఉదయం నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంహా కర్ఫ్యూ విధిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. మంగళవారం నాటి విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకునే కోనసీమ జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • కోనసీమలో విధ్వంసం ఘటనలపై స్పందించిన MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ:
    ఏపీలోని వేరే జిల్లాలకు ఎన్టీఆర్, వైఎస్సార్, అల్లూరి, అన్నమయ్య, పొట్టి శ్రీరాములు, ప్రకాశం గార్ల పేర్లు పెట్టినప్పుడు లేని అభ్యంతరం రాజ్యాంగ నిర్మాత అయిన డా బిఆర్ అంబేడ్కర్ పేరు పెడితేనే ఎందుకు వస్తోందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. కోనసీమలో విధ్వంసం ఘటనలపై స్పందించిన మంద కృష్ణ మాదిగ.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సిగ్గు చేటు అని ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ల మీద దాడికి పాల్పడి నిప్పుపెట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ దాడి వెనుక అరాచక శక్తులు ఉన్నాయని.. దాడికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంద కృష్ణ మాదిక మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

  • కోనసీమ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత: పవన్ కళ్యాణ్

    ఏపీని అభివృద్ధి చేయడంలో విఫలమైన పాలక వర్గం... అమలాపురంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలోనూ విఫలమైందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తమ తప్పులను, లోపాలను కప్పి పుచ్చుకునేందుకే ఇలా లేనిపోని సమస్యలు సృష్టించడమే కాకుండా ఆ వైఫల్యాలను ఇతర పార్టీలకు ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమలాపురంలో జరుగుతోంది ఏంటో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అన్నింటికిమించి బాధ్యత కలిగిన హోంమంత్రి పదవిలో ఉన్న తానేటి వనిత ఈ ఘటనపై స్పందిస్తూ జనసేన పార్టీ పేరు ప్రస్తావించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మీ ప్రభుత్వంలోని లోపాలను, అసమర్ధతను ఇలా జనసేన పార్టీపై రుద్దకండి అని పవన్ కళ్యాణ్ హోంమంత్రికి హితవు పలికారు.

  • Pawan Kalyan on Konaseema violence: కోనసీమ విధ్వంసం ఘటనపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందన:
    కోనసీమ విధ్వంసం ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. అమలాపురంలో చోటుచేసుకున్న ఘటనను ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలి అని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్... అక్కడి ప్రజలు అందరూ సంయమనం పాటించాలి అని విజ్ఞప్తి చేశారు. అమలాపురంలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు అందరూ సహకరించాలి అని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల కూడా గౌరవమే ఉంటుంది. అటువంటి మహానుభావుడి పేరును వివాదాలకు కేంద్ర బిందువు చేయడం దురదృష్టకరం అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు.

  • ఆందోళనకారుల ముసుగులో పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెడుతున్న వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోంమంత్రి తానేటి వనిత మరోసారి పునరుద్ఘాటించారు.

  • ఆందోళనకారుల పేరిట అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు. నిరసనకారుల దాడిలో 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో స్కూల్ బస్సులను కూడా తగులబెట్టి విధ్వంసం సృష్టించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టంచేశారు.

  • AP Home Minister Taneti Vanitha - కోనసీమ విధ్వంసంపై హోంమంత్రి తానేటి వనిత స్పందన..
    కోనసీమ విధ్వంసం ఘటనపై ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, వర్గాలు చేసిన డిమాండ్ మేరకే కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం జరిగింది అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప మేధావి, భారతరత్న అయిన డా.బీఆర్ అంబేడ్కర్ ఎంతోమందికి ఆదర్శం. అలాంటి గొప్ప వ్యక్తి పేరును ఒక జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. కొంతమంది రాజకీయ కుట్రతో ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని.. అలాంటి వాళ్ల వల్లే అమలాపురంలో నేటి విధ్వంసం చోటుచేసుకుందని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

  • Konaseema District Protests Live Updates: కోనసీమ జిల్లా పేరు మార్పుని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన నిరసనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టడంతో సరిపెట్టుకోలేదు. కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి సైతం నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. అడ్డం వచ్చిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. అమలాపురంలో అధికార పార్టీ నేతల నివాసాలు, ఆస్తులే లక్ష్యంగా ఆందోళనకారులు రెచ్చిపోయి దాడులకు పాల్పడ్డారు. అయితే, ఈ ఆందోళనల వెనుక, దాడులకు పాల్పడిన వారి వెనుక జనసేన పార్టీ, టీడీపీలే ఉన్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

  • Minister Vishwaroop's house and cars set on fire: మంత్రి విశ్వరూప్ ఇంటికి, కార్లకు నిప్పంటించిన ఆందోళనకారులు: 
    కోనసీమ జిల్లా పేరు మార్పు వివాదం భారీ ఎత్తున ఆందోళనకు దారితీసింది. కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన అమలాపురంలో మంత్రి విశ్వరూప్ నివాసానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు అంతటితో ఊరుకోకుండా మంత్రి నివాస ప్రాంగణంలో ఉన్న వాహనాలకు సైతం నిప్పంటించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link