Kuppam Babu Tour: కుప్పంలో టెన్షన్‌..టెన్షన్..ఇక్కడి నుంచే ధర్మపోరాటమన్న చంద్రబాబు..!

Thu, 25 Aug 2022-1:03 pm,

Kuppam Babu Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలకు దిగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Kuppam Babu Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్‌ టెన్షన్‌ కనిపిస్తోంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రెండో రోజు టూర్‌ను అడ్డుకుంటామని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. ఈక్రమంలో బంద్‌కు పిలుపునిచ్చింది. నగరంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. చంద్రబాబు ప్రారంభించనున్న అన్న క్యాంటీన్‌ను సైతం తొలగించారు. దీంతో ఇరుపార్టీల నేతలు ఘర్షణకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగారు.


ఇప్పటికే స్వచ్ఛందంగా స్కూళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. కుప్పం పరిధిలోని ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇరుపార్టీల బల ప్రదర్శనతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పలుచోట్ల బారికేడ్లను అమర్చారు. బంద్‌ను సక్సెస్ చేస్తామని వైసీపీ చెబుతోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు టూర్‌ను సక్సెస్ చేస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 

Latest Updates

  • అన్న క్యాంటీన్‌పై దాడి హేయమైన చర్య: అచ్చెన్నాయుడు
    కుప్పంలో బాబును తిరగకుండా చేస్తున్నారు
    ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం
    సీఎం జగన్ దర్శకత్వంలో దాడి: అచ్చెన్నాయుడు
    శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు కుట్ర
    కుప్పంలో వైసీపీ శ్రేణులను నియంత్రించాలి
    సీఎంవో, డీజీపీ కార్యాలయం ముట్టడిస్తాం: అచ్చెన్నాయుడు
    త్వరలో కడపలో సమావేశం పెడతాం: అచ్చెన్నాయుడు
    ఎలా అడ్డుకుంటారో చూస్తాం: అచ్చెన్నాయుడు

  • కుప్పం చోటామోటాలు కాదు..దమ్ముంటే జగన్, పెద్దిరెడ్డి రావాలి
    కుప్పంలో ఎప్పుడైనా రౌడీయిజం చూశారా: చంద్రబాబు
    పోలీసులు, వైసీపీ గూండాలు కలిసి వచ్చినా 2 నిమిషాల్లో సమాధానం చెబుతా
    రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారా: చంద్రబాబు
    బాదుడే బాదడు కార్యక్రమాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు: చంద్రబాబు

  • ఇవాళ కుప్పం చరిత్రలోనే చీకటి రోజు: చంద్రబాబు
    అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా
    నాపైనే దాడికి దిగుతారా: చంద్రబాబు
    కుప్పం నుంచే ధర్మపోరాటం
    ఖబర్దార్ జగన్ రెడ్డి: చంద్రబాబు

  • కుప్పంలో అన్న క్యాంటీన్ దగ్గర చంద్రబాబు నిరసన
    అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు
    అన్న క్యాంటీన్, టీడీపీ బ్యానర్లను చించేసిన వైసీపీ కార్యకర్తలు
    కుప్పం బంద్‌కు వైసీపీ నేతల పిలుపు
    డిపోలకే పరిమితమైన బస్సులు
    మూతపడ్డ దుకాణాలు, వ్యాపార సముదాయాలు

  • కుప్పంలో నడిరోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు
    వైసీపీ దాడులకు నిరసనగా చంద్రబాబు ధర్నా
    చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత
    టీడీపీ ఫ్లెక్సీల ధ్వంసం
    అన్న క్యాంటీన్ ధ్వంసం
    టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ
    అప్రమత్తమై పోలీసులు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link