AP and Telangana Rain Update: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
Andhra Pradesh and Telangana Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడగా.. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులతో ఉపశమనం చెందారు. తెలంగాణలో మరో నాలుగు రోజులు, ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.
Andhra Pradesh and Telangana Weather Forecast: భారీ ఎండలు, వడ గాల్పులతో తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు ఉపశమనం కలిగింది. మంగళవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం నమోదైంది. నగరంలో భారీ వర్షం కారణంగా వరద నీరు రోడ్లపై నిలిచిపోగా.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న 4 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలో కూడా రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
AP Rain Update Telangana Rain Update: ఇవాళ సాయంత్రం వరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు హైదరాబాద్ చుట్టుపక్కల, చుట్టుపక్కల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు..
Andhra Pradesh and Telangana Live Updates: భారీ వర్షం విషాదాన్ని నింపింది. హైదరాబాద్ బాచుపల్లిలో ఘోరం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం కురిసిన వానకు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటు రిటర్నింగ్ వాల్ కూలి 7 గురు కార్మికులు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Andhra Pradesh and Telangana Live Updates: ఏపీలోని కోస్తాంధ్రలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.