YCP Lok Sabha Candidates List: రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపుపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. పలు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తూ.. మరికొన్ని చోట్ల సిట్టింగ్‌లకు అవకాశం కల్పిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. టికెట్ దక్కని నేతలు నిరాశ చెందొద్దని.. ఎందుకు మార్చాల్సి వస్తుందో పార్టీ పెద్దలు వివరిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీ అభ్యర్థులను కూడా ఫైనల్ చేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించే అవకాశం కనిపిస్తుండగా.. కొంతమంది సిట్టింగ్‌లకు నిరాశ ఎదురుకానుంది. పార్టీ వర్గాల ప్రకారం.. ఎంపీ అభ్యర్థులు వీళ్లేనని ప్రచారం జరుగుతోంది.
 
==> శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి 2019లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, పిరియా విజయ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
==> విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మజ్జి శ్రీనివాసరావు, మంత్రి బొత్స సత్యానారాయణ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.
==> విశాఖపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఈసారి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. బొత్స ఝాన్సీలక్ష్మి పేరును ఖరారు చేసే ఛాన్స్ ఉంది.
==> అరకు పార్లమెంట్ స్థానం నుంచి గొడ్డేటి మాధవి సిట్టింగ్ ఎంపీగా ఉండగా ఈసారి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరు దాదాపు ఖరారు అయింది.
==> అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి ఉండగా.. ఈసారి కరణం ధర్మశ్రీని పోటీ చేయించే అవకాశం ఉంది.
==> కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత స్థానంలో చలమలశెట్టి సునీల్ పేరు పరిశీలనలో ఉంది.
==> అమలాపురం నుంచి చింతా అనురాధ సిట్టింగ్ ఎంపీగా ఉండగా.. ఎలీజా పేరు పరిశీలిస్తున్నారు. 
==> రాజమండ్రి లోక్‌సభ నుంచి సిట్టింగ్ ఎంపీగా మార్గాని భరత్ ఉన్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన అనుసూరి పద్మలత పేరు పరిశీలిస్తున్నారు.
==> నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణంరాజు ఉన్నారు. ఆయన పార్టీకి దూరంగా ఉండడంతో గోకరాజు గంగరాజు, ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.
==> ఏలూరు నుంచి సిట్టింగ్ ఎంపీగా కోటగిరి శ్రీధర్ ఉన్నారు. ఆళ్ల నాని, మంత్రి కొట్టు సత్యనారాయణ, అరసవిల్లి అరవింద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
==> మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ వల్లభనేని బాలశౌరి స్థానంలో డైరెక్టర్ వీవీ వినాయక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
==> విజయవాడ ఎంపీగా 2019లో పీవీపీ పోటీ చేశారు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 
==> గుంటూరు నుంచి 2019లో వైసీపీ అభ్యర్థిగా  మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పోటీ చేయగా.. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పేరు పరిశీలిస్తున్నారు.
==> నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు స్థానంలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేరును పరిశీలనలో ఉంది.
==> బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ నందిగం సురేశ్ కొనసాగే ఛాన్స్ ఉంది. 
==> ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. 
==> నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి స్థానంలో సినీ నటుడు అలీ, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్లను పరిశీలిస్తున్నారు. 
==> కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి సంజీవ్‌కుమార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరు జయరాం పేరును పరిశీలనలో ఉంది.
==> అనంతపురం ఎంపీ తలారి రంగయ్య స్థానంలో మాజీ మంత్రి, పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ పేరు ఖరారు అయింది.
==> హిందూపురం ఎంపీ అభ్యర్థిగా జె.శాంతమ్మ పేరు ఫిక్స్ అయింది.
==> కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని మార్చే అవకాశం లేదు.
==> నెల్లూరు సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉంది.
==> తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని కొనసాగించే ఛాన్స్ ఉంది.
==> రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డి, చిత్తూరు ఎంపీగా ఎస్.రెడ్డప్పలను మార్చే అవకాశం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  Passport Appointment: పాస్‌పోర్టు దరఖాస్తు పెండింగ్‌లో ఉందా..? క్షణాల్లో పరిష్కరించుకోండి ఇలా..  


Also Read: Naa Saami Ranga: అంచనాలు తారుమారు చేసిన నాగార్జున.. ఈసారి హిట్ దక్కేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook