Perni Nani Look Out:వైయస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.  రేషన్ బియ్యం మాయం కేసులో.. రికార్డులు సంబంధిత పత్రాలతో పేర్ని నాని, జయసుధ హాజరు కావాలని నిన్న పోలీసులు నోటీసులు జారీ చేశారు.  అయితే వారు హాజరు కాలేదు. పేర్ని నాని, ఆయన భార్య జయసుధ, కుమారుడు కిట్టు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అందుకే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. అయితే పేర్ని నాని కుటుంబం దేశాన్ని విడిచి వెళ్లారా లేదా అనేది తెలియాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకోసం వారి పాస్ పోర్ట్ లకు సంబంధించి విదేశీ మంత్రిత్వ శాఖను ఆశ్రయించి వారు దేశం విడిచి వెళితే.. పాస్ పోర్ట్ పై స్టాంప్ వేసినట్టు ముద్ర ఉంటుంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.


పేర్నినాని అసలు పేరు పేర్ని వెంకటరామయ్య. 2019 ఎన్నికల్లో ఈయన మచిలీపట్నం (బందరు) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గవర్నమెంట్ విప్ గా పనిచేశారు. కాంగ్రెస్ లో పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన పేర్ని నాని.. ఆ తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెంది వైయస్ఆర్సీపీలో  చేరారు. ఆయన మంత్రి వర్గంలో పనిచేశారు.


 


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.