AP Rains: ఆంద్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత కొద్దిరోజులుగా వాతావరణం వేడెక్కిపోయుంది. తీవ్రమైన ఉక్కపోత, ఎండలు ఓవైపు, వర్షాభావ పరిస్థితులు మరోవైపు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశాయి. ఇప్పుడీ పరిస్థితి నుంచి ఉపశమనం కలిగే శుభవార్తను ఐఎండీ అందిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణ శాఖ నుంచి ఏపీకు శుభవార్త. ఎండలు, వేడిమి నుంచి ఏపీ ప్రజలు ఉపశమనం పొందనున్నారు. నైరుతి బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య రేపటికి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడవచ్చు. ఆ తరువాత మూడు రోజులు పశ్చిమ బెంగాల్ వైపుకు కదులుతూ తుపానుగా మారనుంది. 


వాయుగుండం తుపానుగా మారిన తరువాత గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయ. సముద్రం అలజడిగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే బలమైన గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ముందుగా తమిళనాడుపై ఆ తరువాత దక్షిణ కోస్తాపై పడనుంది. ఫలితంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడపు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. 


Also read: AP CM YS Jagan: ఒప్పంద ఉద్యోగులకు దసరా కానుక, రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook