Eluru Fire Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆ ప్రమాద వివరాలివీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని అక్కిరెడ్డి పాలెంలో బుధవారం రాత్రి ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరగాయి. మంటల ధాటికి అక్కడున్న రియాక్టర్ కూడా పేలినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సమయంలో దాదాపు 150 మంది సిబ్బంది పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం కాగా..మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మరణించారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టింది. 


ప్రమాదం ఎలా జరిగింది


ఏలూరు జిల్లా మద్దూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదమిది. ఫ్యాక్టరీలోని యూనిట్ 4లో బుధవారం రాత్రి పది గంటల తరువాత భారీ శబ్దంతో మంటలు అలుముకున్నాయి. ఆ సమయంలో ఫ్యాక్టరీలో చాలామంది పనిచేస్తున్నారు. ఒక్కసారిగా శబ్దం రాగానే..కింది విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. పై భాగంలో పనిచేస్తున్న సిబ్బంది తప్పించుకోలేకపోయారు. ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. 13మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 70 శాతం పైగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. 


అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ నైట్ షిప్ట్‌లో 150 మంది వరకూ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీలో కెమికల్ ఫ్యాక్టరీల్లో వినియోగించే పొడిని తయారు చేస్తుంటారు. పూర్తి జనావాసాల మధ్య ఉన్న ఈ ఫ్యాక్టరీని తరలించాలని చాలాకాలంగా ఫిర్యాదులు వచ్చినా స్థానిక యంత్రాంగం పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.


Also read: APSRTC Charges Hike: ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు.. కనీస టికెట్ ధర రూ.15..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook