Visakhapatnam Inter Student: ఆ విద్యార్థి ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిల్ అయ్యాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఏమాంటోరనని భయపడ్డాడు. ఇంటికి వెళ్లలేక రాత్రి వేళ ఓ పాత కారులో కూర్చుని ఏడుస్తూ కూర్చుకున్నాడు. ఆ కారు అధికార పార్టీకి చెందినది కాగా.. కారులో కూర్చున్న బాలుడిని చూసి దొంగతనం కోసం వచ్చావా..? అంటూ బట్టలు విప్పించి చితక్కొట్టారు. ఆయన కొట్టడమే కాకుండా డ్రైవర్‌తోనూ కొట్టించాడు. రెండు గంటలపాటు నరకం చూపించారు. తీరా రాత్రి వేళ బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. కొడుకుని తీసుకువెళ్లండని ఫోన్ చేసి చెప్పారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రామకృష్ణనగర్‌కు చెందిన నాగ రవికిరణ్‌ (17) అనే విద్యార్థి ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిల్ అయ్యాయన్న బాధతో ఇంటికి వెళ్లలేకపోయాడు. దీంతో ఓ పాత కారులో కూర్చొని ఏడుస్తూ కూర్చొన్నాడు. ఆ కారు వైసీపీ ఉత్తరాంధ్ర యువజన సంఘం అధ్యక్షుడు సునీల్‌కు చెందినది. తల్లి సింగాలమ్మలతో కలిసి ఆయన వడ్డీ వ్యాపారం నిర్వహిస్తుంటారు. తమ వద్ద రుణం తీసుకుని ఓ వ్యక్తి చెల్లించకపోవడంతో ఆ కారును జప్తు చేసుకుని తీసుకువచ్చారు. ఆ కారులో నాగ రవికిరణ్‌ కూర్చొని ఉండడంతో దొంగతనం కోసం వచ్చావా.. అంటూ సునీల్‌, సింగాలమ్మ బాలుడిని ఇంట్లోకి ఈడ్చుకెళ్లారు.
ఇంటి డాబాపైకి తీసుకువెళ్లి.. దుస్తులు విప్పించి నగ్నంగా చితక్కొట్టారు. తమ కారు డ్రైవర్‌తోనూ బాలుడిని కొట్టించారు. 


బాలుడి చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కొని.. రాత్రి 9 గంటల నుంచి 11 గంటలకు డాబాపైనే నిర్భంధించారు. దీంతో నాగ రవికిరణ్‌ భయంతో వణికిపోయాడు. అనంతరం అతని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి.. మీ అబ్బాయి తమ దగ్గర ఉన్నాడని వైసీపీ నేత చెప్పారు. ఏమైందోనని కంగారు పడిన తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. పిడిగుద్దులు గుద్దడంతో నాగ రవికిరణ్‌ చెంపభాగం కమిలిపోయింది. అక్కడడక్కడ దెబ్బలు, వాపు ఉండడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా కొడతారా..? అని మండిపడ్డారు. ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండని సునీల్ చెప్పగా.. గురువారం ఉదయం వారు విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి గాయాలను పోలీసులకు చూపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాసరావుకు తెలిపారు.


Also Read:  Dantewada Attack: దంతెవాడ ఘటనపై మవోయిస్టులు లేఖ విడుదల.. పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే..?  


Also Read: Karnataka Elections: అమిత్ షా సూపర్ స్కెచ్.. ఆ నేతలను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్..!   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook