Country Bomb Exploded in Mouth: తాగిన మైకంలో తాగుబోతులు ఏం చేస్తుంటారో వారికే తెలియదు అంటుంటారు పెద్దలు. అది నూటికి నూరు శాతం నిజం అని చెప్పేందుకు నిదర్శనంగా నిత్యం ప్రపంచం నలుమూలలా ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. వాటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం. తాగిన మైకంలో పాములను పట్టుకుని మెడలో వేసుకున్న వాళ్లను చూశాం.. మద్యం మత్తులో రోడ్డుపైకి ఎక్కి వేగంగా వెళ్తున్న వాహనాలకు ఎదురెళ్లి నిలబడి ట్రాఫిక్ జామ్ అయ్యేలా హల్‌చల్ చేసిన వారిని చూశాం.. మద్యం మత్తులో వాహనాలు నడిపి, స్టంట్స్ చేసి ప్రమాదానికి గురైన వాళ్లను చూశాం... కానీ ఇదిగో మనం ఇప్పుడు తెలుసుకోబోయే వ్యక్తి మాత్రం ఏకంగా నోట్లోనే నాటు బాంబు పెట్టుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. బంగారుపాలెం సీఐ నాగరాజు రావు వెల్లడించిన వివరాల ప్రకారం గడ్డంవారిపల్లి గ్రామానికి చెందిన ఎం చిరంజీవి అనే 35 ఏళ్ల వ్యక్తికి అక్కడికి సమీపంలోనే మరో గ్రామానికి చెందిన యువతితో పెళ్లయింది. భార్యభర్తల మధ్య ఏదో గొడవ జరగడంతో చిరంజీవి భార్య అతడిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉన్న చిరంజీవి మద్యానికి బానిసయ్యాడు. 


ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి బాగా మద్యం తాగిన మైకంలో ఉన్న చిరంజీవి తన చేతికి అందిన నాటు బాంబును నోట్లో పెట్టుకుని కొరికాడు. దీంతో ఆ నాటు బాంబు భారీ శబ్ధం చేస్తూ అతడి నోట్లోనే పేలిపోయింది. పేలుడు శబ్ధం విన్న చుట్టుపక్కల వారు, గ్రామస్తులు అక్కడికి చేరుకునేటప్పటికి పేలుడు ధాటికి చిరంజీవి ముఖం మొత్తం చిద్రమైపోయి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే వారు అతడిని చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 


ఇది కూడా చదవండి : TDP-Janasena: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ-జనసేన పోరాటం.. ఉమ్మడి తీర్మానాలు ఇవే..!


తాగిన మైకంలో వ్యక్తి నాటు బాంబు నోట్లో పెట్టుకుని కొరకడంతో పేలుడు సంబవించింది అని సమాచారం అందుకున్న బంగారుపాలెం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరంజీవి మృతిపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అసలు చిరంజీవి చేతికి నాటు బాంబు ఎలా వచ్చింది ? అతడికి ఎవరు ఇచ్చారు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దసరా పండగ వేళ జరిగిన ఈ దుర్ఘటన గడ్డంవారిపల్లిలో విషాదఛాయలు అలుముకునేలా చేసింది.


ఇది కూడా చదవండి : AP Rains: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, రానున్న మూడ్రోజుల్లో ఏపీకు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి