యువకుడి ప్రాణాన్ని బలిగొన్న సెల్ ఫోన్ !
ఒంగోలు: సెల్‌ఫోన్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చార్జింగ్ పెట్టిన సమయంలో ఆకస్మాత్తుగా ఫోన్ పేలడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ప్రకాశం జిల్లా కనిగిరి మండలం వాగుపల్లికి చెందిన మస్తాన్‌రెడ్డి (31) సోమవారం రాత్రి సెల్ ఫోన్ తన పొట్టపై పెట్టుకొని నిద్రిస్తున్నాడు. రాత్రి 10 గంటల సయయంలో ఆకస్మాత్తుగా ఫోన్ పేలింది. ఇంట్లో నుంచి పొగలు, కాలిన వాసన రావడంతో స్థానికులు లోపలికెళ్లి చూడగా మస్తాన్‌రెడ్డి చనిపోయి ఉన్నాడు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి..విద్యుత్ షాక్‌తో చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిద్రించే సమయంలో సెల్ ఫోన్ పక్కన పెట్టుకోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఓ చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా మస్తాన్‌రెడ్డి తీసుకున్నాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని విలువైన ప్రాణాలను కాపాడుకుందాం.. దయచేసి సెల్ ఫోన్ పక్కన పెట్టి ఛార్జింగ్ చేస్తూ నిద్రించకండి.