JAGAN Mangalagiri: మంగళగిరిలో ప్లాన్ మార్చిన సీఎం జగన్.. నారా లోకేష్ సీటు మార్చుకోవాల్సిందేనా?
JAGAN Mangalagiri: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు దూకుడు పెంచడమే ఇందుకు కారణం. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది
JAGAN Mangalagiri: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు దూకుడు పెంచడమే ఇందుకు కారణం. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్న సీఎం జగన్.. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలుచుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగులను మార్చాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఎమ్మెల్యేల పని తీరు, సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపికి చేస్తున్న జగన్.. టికెట్ కష్టమనుకున్నవారికి సిగ్నల్ ఇస్తున్నారని చెబుతున్నారు. తాడికొండ నియోజకవర్గ పార్టీ బాధ్యతలను ఎమ్మెల్యే శ్రీదేవికి కాకుండా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ కు అప్పగించారు జగన్. దీంతో వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా డొక్కాను పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారనే చర్చ సాగుతోంది.
తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కీలక పరిణామం జరిగింది. మంగళగిరి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ లోకేష్ మంగళగిరి నుంచే పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో తరుచూ పర్యటిస్తున్నారు లోకేష్. అయితే చంద్రబాబు కుప్పం సెగ్మెంట్ తో పాటు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేశారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే మంగళగిరికి చెందిన టీడీపీ సీనియర్ నేత గంజి చిరంజీవి, అతని కుటుంబ సభ్యులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో గంజి చిరంజీవికి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
[[{"fid":"243316","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
గంజి చిరంజీవి వైసీపీలో చేరడంతో మంగళగిరిలో రాజకీయ సమీకరణలు మారిపోనున్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మంగళగిరి అభ్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేస్తారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో సామాజికవర్గాల పరంగా చేనేత కులస్తులు ఎక్కువగా ఉన్నారు. మొత్తం రెండు లక్షలకు పైగా ఉన్న ఓట్లలో అత్యధిక శాతం వారి ఓట్లే చేనేతలవే. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చిరంజీవి.. ఆర్కే చేతిలో కేవలం 26 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో మాత్రం నారా లోకేష్ పోటీ చేశారు. నియోజకవర్గంలో బలమైన సామాజకవర్గానికి చెందిన చిరంజీవిని వచ్చే ఎన్నికల్లో లోకేష్ పై పోటీకి పెట్టాలని జగన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందుకే జగన్ ప్రత్యేక ఆసక్తి తీసుకుని చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించారని అంటున్నారు.
[[{"fid":"243317","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
మంగళగిరి ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆర్కే.. 2019లో లోకేష్ పై 5 వేల 300 ఓట్ల తేడాతో గెలిచారు. జగన్ కు సన్నిహితుడైన ఆర్కేను కాదని చిరంజీవి టికెట్ ఎలా ఇస్తారనే చర్చ కూడా సాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆర్కేను మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నారంటున్నారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నుంచి ఆర్కే పోటీలో ఉంటారనే టాక్ వైసీపీ వర్గాల నుంచి వస్తోంది. సత్తెనపల్లి నుంచి ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అంబటిని కృష్ణా జిల్లా అవనిగడ్డకు షిప్ట్ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్ టార్గెట్ గానే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మంగళగిరి నుంచి గంజి చిరంజీవి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉంటే నారా లోకేష్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయనే టాక్ వస్తోంది.
Read Also: Sai Priya Case: విశాఖ సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్.. ఈసారి ఏం జరిగిందంటే?
Read Also: భారత్-పాక్ టీఆర్‌పీ రేటింగ్స్ అదుర్స్.. టీ20 ప్రపంచకప్, ఐపీఎల్ రికార్డులు బ్రేక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి