విశాఖ: పొని తుపాను కారణంగా పలు రైళ్లు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. మే 2వ ( ఈ రోజు ) తేదీ సాయంత్రం నుంచి తీర ప్రాంతానికి చేరువగా ఉన్న ప్రాంతాల్లో రైలు మార్గాల్లో రైళ్లు నడపడం లేదని తెలిపింది. ఈ క్రమంలో ఈస్ట్ కోస్ట్ పరిధిలోని 74  రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేశాఖ తెలిపింది
రద్దైన రైళ్ల వివరాలు... 
విశాఖ-భువనేశ్వర్ మధ్య నడిచే  రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. హౌరా నుంచి పూరీ వెళ్లే రైళ్లు రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు హౌరా నుంచి నడవవు. అలాగే హౌరా నుంచి బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ వైపు వెళ్లు రైళ్లు  రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.


లోకల్ ట్రైన్ రద్దు..
అలాగే భువనేశ్వర్ - పూరీ ,  భద్రక్ - విజయనగరం మధ్య రైలు సర్వీసులు నిలిచిపోనున్నాయి. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ప్రయాణించే పాసింజర్ ట్రైన్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని..ఈ రూట్లలో ప్రయాణించే వారు ఇతర మార్గాలను చూసుకోవాల్సిందిగా రైల్వే శాఖ సూచించింది.