Married Lady Cuts Her Lover Genitals in Andhra Pradesh: ప్రియుడి మర్మాంగాన్ని ప్రియురాలు కత్తిరించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాక అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పక్కనే ఉన్న గూడపల్లి అనే గ్రామానికి చెందిన కృష్ణ గణేష అనే వ్యక్తికి తాటిపాక గ్రామానికి చెందిన ఒక వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది, ఈ నెల 17వ తేదీ రాత్రి సమయంలో తన భర్త ఇంటి వద్ద లేడని కృష్ణ గణేష్ ని ఇంటికి పిలిపించుకున్న మహిళ అతను వచ్చిన తర్వాత అతనితో రాసలీలల్లో మునిగి తేలింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది, కృష్ణకు ఆమెతో కాకుండా మరికొంతమంది మహిళలతో అక్రమ సంబంధం ఉంది అని అనుమానించిన సదరు వివాహిత ఒక బ్లేడుతో కృష్ణ గణేష్ మీద దాడి చేసింది.


ఈ దాడిలో కృష్ణ మర్మాంగానికి గాయమైంది. వెంటనే పెద్ద ఎత్తున అరవడంతో ఆమె అప్రమత్తమై అతన్ని హాస్పిటల్ కి తరలించింది. ప్రస్తుతానికి బాధితుడు కృష్ణ అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వివాహిత మీద కేసు నమోదు చేశారు. ఆమె మీద సెక్షన్ 326 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఒకరకంగా ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళవద్దని పోలీసులు ఎంత చెబుతున్నా వినకుండా యువకులు ఎక్కువగా ఇలాంటి వ్యవహారాల జోలికి వెళ్తున్నారని అటు తిరిగి ఇటు తిరిగి తమ నెత్తి మీదకే ఇబ్బందులు తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. ఇకమీదటైనా ఇలాంటి విషయాలు జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటారని లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.


Also Read: Pathaan Film : షారుక్ ఖాన్ తన కూతురితో కూర్చుని పఠాన్ సినిమా చూడాలట.. అయ్యే పనేనా?


Also Read: LPG Gas Cylinder: రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ముఖ్యమంత్రి సంచలన ప్రకటన  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.