పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు బీఎస్పీ చీఫ్ మాయవతి  ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ రోజు  విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ..సీఎం పదవికి పవన్ కల్యాణ్ అన్ని విధాలా అర్హుడని పేర్కొన్నారు. ఆయన తమ కూటమికి సీఎం అభ్యర్ధిని మాయావతి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, వామపక్షాల కూటమిని గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె ఏపీ ప్రజలను కోరారు. 


ఈ సందర్భంగా మాయవతి జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ కేంద్ర మోడీ హవా పూర్తిగా తగ్గిపోయిందని..కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని జోక్యం చెప్పారు. ఎన్నికల తర్వాతే ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే ముఖ్య కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సరైన న్యాయం జరగలేదని... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఈ సందర్భంగా మాయవతి ఏపీ ప్రజల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు