Mega heros Fans meet: ముగ్గురు మెగా హీరోల అభిమానుల భేటీ.. జనసేనకు మద్దతుపై చర్చ
Mega heros Fans meet: ఇటు ఏపీ.. అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టిన వేళ కీలక పరిణామం సంభవించింది. ముగ్గురు మెగా హీరోల అభిమానుల భేటీ రాజకీయ వేడి రాజేస్తోంది. మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఒక చోట భేటీ అయ్యి చర్చించడం హాట్ టాపిక్‌గా మారింది.
Mega heros Fans meet: ఇటు ఏపీ.. అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టిన వేళ కీలక పరిణామం సంభవించింది. ముగ్గురు మెగా హీరోల అభిమానుల భేటీ రాజకీయ వేడి రాజేస్తోంది. మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఒక చోట భేటీ అయ్యి చర్చించడం హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక పాత్ర పోషిస్తూ సాగుతోంది జనసేన. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజాపోరాటంలో భాగంగా రైతు సమస్యలను జనసేన ప్రధాన అస్త్రంలో భుజానకెత్తుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శిస్తున్నారు పవన్ కల్యాణ్. దాదాపు 200 వందల కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. మరిన్ని కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటామని జనసేన ఇప్పటికే ప్రకటించింది.
ఏపీలో బీజేపీతో పొత్తుతో ముందుకెళుతున్న జనసేన.. జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం టీడీపీ తదితర ప్రతిపక్షాలను కలుపుకుని ముందుకెళ్లాలని జనసేన పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. అటు టీడీపీ నుంచి కూడా పొత్తుకు సిద్ధమన్న సంకేతాలు వచ్చాయి. అయితే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు సానుకూలంగా లేదు. తాము జనంతోనూ జనసేనతోనూ తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చేశారు. అయినా పొత్తు కోసం కమలనాథులను ఒప్పించేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.
ఇంకోవైపు తెలంగాణ ఎన్నికలపైనా జనసేన ఫోకస్ పెట్టింది. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. తెలంగాణలోనూ తాము పోటీ చేస్తామంటూ ప్రకటించి ఇటు అభిమానులు, అటు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణలోనూ తమకు బలం ఉందని చెప్పిన జనసేనాని..తాము 15 సీట్లలో కచ్చితంగా గెలుస్తామని లెక్కలు కట్టి మరీ చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని సీమాంధ్రులు.. అధికార టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తూ వస్తున్నారు. ఒక వేళ జనసేన పోటీకి దిగితే.. వారి ఓట్లు పవన్ పార్టీకి పడొచ్చన్న అంచనాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పవన్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ముగ్గురు మెగా హీరోల అభిమానులు విజయవాడలో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఏపీలోని అన్ని జిల్లల నుంచి పరిమిత సంఖ్యలో మెగా అభిమానులు ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. జనసేన పార్టీకి మద్దతుగా నిలిచే అంశంపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి, పవన్, రామ్‌చరణ్ అభిమానులు.. జనసేన బలోపేతానికి చేయాల్సిన దానిపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించి, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అటు తెలంగాణలోనూ మెగా ఫ్యాన్స్ అభిమానులు ఇదే తరహా సమావేశం అవుతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also read: KGF Chapter 2 Update: హోరెత్తిస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 కలెక్షన్లు, కేజీఎఫ్ కధ రాసిందెవరో తెలుసా
Also read: Air Force Jobs 2022: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.