Michaung Cyclone Alert: ఏపీకు తుపాను ముప్పు, డిసెంబర్ 5 వరకూ భారీ వర్షాలు
Michaung Cyclone Alert: ఏపీకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా, ఆ పై తుపానుగా మారనుంది. ఫలితంగా రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Michaung Cyclone Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుంది. ఇప్పటికే ఉన్న వాయుగుండం కాస్తా ఇవాళ తీవ్రంగా మారి ఆదివారం నాటికి తుపానుగా బలపడనుంది. ఈ నెల 5వ తేదీ ఉదయానికి తీరం దాటనుందని వాతావరణ శాఖ సూచించింది. తుపాను ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రస్తుతం నెల్లూరుకు ఆగ్నేయంగా 700, బాపట్లకు 800 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 800 కిలోమీటర్లు ఆగ్నేయంగా విస్తరించి ఉంది. ఇవాళ రాత్రికి తీవ్రరూపం దాల్చనుంది. ఆ తరువాత పశ్చిమ దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి తుపానుగా మారనుంది. ఈ తుపానుకు మయన్మార్ సూచించిన మిచౌంగ్ పేరుతో నామకరణం చేశారు. ఈ నెల 4వ తేదీ అంటే సోమవారానికి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకోనుంది. మంగళవారం అంటే ఐదవ తేదీ ఉదయం మచిలీపట్నం సమీపంలో తీరం దాటవచ్చని అంచనా.
మిచౌంగ్ తుపాను ప్రభావంతో రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
తుపాను ముప్పు నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి. విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజల్ని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని సిద్ధం చేశారు. ఇవాళ రాత్రి నుంచి డిసెంబర్ 5 వరకూ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి.
Also read: Kakinada: బోటులో పేలిన గ్యాస్ సిలిండర్.. చిక్కుకున్న 11 మంది..కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook