చంద్రబాబు సెక్యూలరీజాన్ని ప్రశ్నించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సెక్యూలరీజంపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2002లో గుజరాత్ అల్లర్లు జరగుతున్నప్పుడు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు..అప్పుడు సెక్యూలరిజంపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో ఎంతో మంది అమాయక ముస్లింలు ఎన్ కౌంటర్లకు గురయ్యారని..అప్పుడు చంద్రబాబు స్వరం వినిపించలేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు సెక్యూలరిజం పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఓవైసీ దయ్యబట్టారు.
ఎన్నికల వ్యూహంలో భాగమేనా ?
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పోటీ చేసే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను మహాకూటమి బరిలోకి దించుతున్నందున అసదుద్దీన్ ఈ కౌంటర్ ఎటాక్ ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగానే చంద్రబాబుపై అసదుద్దీన్ ఈ మేరకు విమర్శలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి