Roja Counter to Pawan Kalyan: తాను ప్రతి ఒక్కరితో తిట్టించుకుంటున్నానని.. చివరికి డైమండ్ రాణి రోజా కూడా తన గురించి మాట్లాడుతోందని అంటూ మంత్రి రోజాపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు చోట్ల ఓడిపోయినోడని డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతుందన్నారు. యువత కోసం డైమండ్ రాణితో కూడా తిట్టించుకోవడానికి సిద్ధమని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. రెండు సార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌తో తిట్టించుకోవాలా..? తూ.. ప్రజల కోసం తప్పట్లేదని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. 


 




మంత్రి రోజాపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'ఆడపిల్లల గురించి నీచంగా మాట్లాడతవా..? రోజాకు ఏం తక్కువ..? దమ్ముగా రెండు సార్లు జనంలో గెలిచింది. 10 ఏళ్లు శాసనసభ్యురాలిగా చేసింది. ఇప్పుడు రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తుంది. నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఏం పొడిచావు..? సిగ్గు శరం లేకుండా ఆడవాళ్ల గురించి అసభ్యంగా మాట్లాడతావా..? నువ్వు మా వాడు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది..' అంటూ ఆయన ఫైర్ అయ్యారు. 


'రోజా డైమండ్ రాణి అయితే.. నువ్వు బాబు గారి జోకర్‌వి.. నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్ వి' అంటూ మరో మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. 'కులాల మ‌ధ్య చిచ్చు పెట్టి ల‌బ్ధి పొందాల‌ని చూడడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నది మీ చంద్ర‌బాబు కాదు ప‌చ్చ పిల్ల‌కాయ‌లు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారికి తాను చేసిన మంచిని చెప్పుకుని ఓట్లు అడ‌గ‌డం త‌ప్ప కులాల పేరుతో రాజ‌కీయాలు చేయ‌డం తెలీదు..' అని మాజీ మంత్రి మేకతోటి సుచరిత కామెంట్ చేశారు. 




'వైసీపీ మగ ముత్తైదువలు మీడియా ముందుకొచ్చి మొరగడం మొదలు పెట్టారు.. వాయినాలు ఇచ్చి పంపండి..!' అంటూ జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దూమారం రేపుతున్నాయి. పొత్తులపై కూడా ఆయన దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. ఒంటరిగా వెళ్లి వీర మరణం పొందాల్సిన అవసరం లేదన్నారు. 


 




'ఒంటిరిగా వెళ్లే స్థాయిలో మీరు నాకు నమ్మకం కలిగిస్తే నేను అప్పుడు నిలబడతా. అందర్నీ హింసించే వాడిని ఎదుర్కోవాలి. అలా అని గౌరవం తగ్గకుండా లొంగిపోకుండా కుదిరితే చేస్తాం. లేదా ఒంటరిగానే వెళ్తాం. ఎక్కడా తగ్గం. నేను ధామాషా పద్దతి అని చెప్పాను. రాజకీయం అంతా మూడు కులాల చుట్టూతే తిరగడమేంటి..? రెడ్డి, కమ్మ, కాపు అంటారేంటి..? మిగిలిన కులాలు లేవా..? ఇది మారాలని నేను కోరుకుంటున్నా. రూలింగ్ కాస్ట్ కాన్సెప్ట్‌కి నేను వ్యతిరేకం. మనమంతా సమానం అన్ని కులాలు సమానం. కొన్ని కులాలు సమానత్వానికి పెద్దన్న పాత్ర పోషిస్తానంటే మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం..' అని పవన్ కళ్యాణ్ అన్నారు.


Also Read: Pawan Kalyan Speech: నేను అన్నింటికీ తెగించిన వాడిని.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ రియాక్షన్ ఇదే..   


Also Read: Pawan Kalyan: ఆ రోజు సినిమాలు వదిలేస్తా.. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను: పవన్ కళ్యాణ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook