కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయమంత్రి సుజనా చౌదరి అన్నారు. అయితే రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్‌తో పనిలేదని.. ఏపీకి నష్టం జరగనివ్వమని ఆయన తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏపీకి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఏమీ మాట్లాడకపోవడం శోచనీయమని.. విశాఖ, విజయవాడ మెట్రోలకు సంబంధించి కూడా బడ్జెట్‌లో ఏమీ ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల విషయం గురించి కూడా ఏమీ మాట్లాడలేదని అన్నారు.


ఇదే విషయంపై ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంటుందని.. అందుకే ఆదివారం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఏపీ రైల్వే జోన్ రావాల్సిందేనని ఆయన తెలిపారు.