హైదరాబాద్: సినీనటుడు మోహన్ బాబు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. మొదట్ని అనుకుంటున్న విధంగానే ఆయన వైపీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఈ రోజు ఆయన వైపీసీ కండువా కప్పుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి మోహన్ బాబు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తన కాలేజీ విద్యార్ధుల ఫీజు బకాయిలు చెల్లించలేదని ఇటివలే రాష్ట్ర ప్రభుత్వ తీరు వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు తీవ్రంగా వ్యతిరేకించిన మోహన్ బాబు ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.


మూడేళ్ల క్రితమే జగన్ ఆహ్వానించారు.. 
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వాన్ని అంతం చేసేందుకు తాను వైసీపీలో చేరానని తెలిపారు. రాష్ట్ర ప్రజలు జగన్ వైపు ఉన్నారని...వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం.. జగన్ సీఎం అవడం ఖాయమన్నారు.వాస్తవానికి మూడేళ్ల క్రితమే జగన్ తనను పార్టీలోకి ఆహ్వానించారని..అప్పుడే వైసీపీ చేరాలకున్నానని..వ్యక్తిగత కారణాల వల్ల ఆ పని చేయలేకపోయనని మోహన్ బాబు తన మనసులో మాటన ఇలా బయపెట్టారు