తెలుగు రాష్ట్రాల వారికి గుడ్ న్యూస్... ఇప్పటి వరకు భగభగ మండిన బానుడు ఇక చల్లబడనున్నాడు. ఎందుకంటే నైరుతీ రుతుపవనాలు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో నిన్నటి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతం ఇంకా చల్లబడలేదు. రుతుపవనాల ప్రభావంతో ఈ ప్రాంతాల్లోనూ ఈ రోజు వర్షాలు కురిసే అవకాశముంది.


హైదరాబాద్ వాతావరణశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ సహా కోస్తాంధ్ర లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమంది.