రైతులకు వాతావరణ శాఖ సూచన
![రైతులకు వాతావరణ శాఖ సూచన రైతులకు వాతావరణ శాఖ సూచన](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2019/06/06/178680-monsoon-arriving-in-kerala-rains-in-kerala-farmers-waiting-for-monsoon-farmers-waiting-for-rains.jpg?itok=wbgvZKeP)
ఎప్పుడెప్పుడు చినుకు పడుతుందా, ఎప్పుడెప్పుడా సాగు మొదలెడదామా అని వర్షం కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్న రైతులకు ఇంకా వేచిచూడక తప్పదు అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.
హైదరాబాద్: ఎప్పుడెప్పుడు చినుకు పడుతుందా, ఎప్పుడెప్పుడా సాగు మొదలెడదామా అని వర్షం కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్న రైతులకు ఇంకా వేచిచూడక తప్పదు అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుండమే అందుకు కారణం అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 8న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత 11న రాయలసీమ, 13న దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి.
గతేడాదితో పోలిస్తే 10 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనుండటం రైతాంగానికి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితే అని చెబుతున్న అధికారులు.. రైతులు అప్పుడే తొందరపడి సాగుకు ముందడుగు వేయొద్దని సూచిస్తున్నారు.