Mother Killed Her Own 2 Children: మాతృత్వానికే కళంకం... కన్నబిడ్డలను కడతేర్చిన తల్లి
కన్న తల్లి తన ఇద్దరి పిల్లలకు విషం పెట్టి కడతేర్చిన ఘటన తూర్పు గోదావరి జిల్లా.. రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...
Mother Killed Her Own 2 Children: ఎలాంటి సమస్య వచ్చిన, బాదేసిన మొదట గుర్తొచ్చేది అమ్మ-నాన్న.. ఈ బంధంలో అమ్మది ప్రత్యేక స్థానం, నాన్నతో కొంచెం భయంతో దూరంగా ఉన్నా.... అమ్మతో ఏ మాత్రం దాపరికాలు లేకుండా అన్ని షేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే తప్పు ఎవరిదైనా తల్లి మాత్రం తన పిల్లల పట్ల ఎప్పుడు సానుకూలంగానే ఉంటుంది.
కానీ అలాంటి గొప్ప బంధానికి కళంకం తెచ్చింది ఒక తల్లి. కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలని కడతేర్చిందో యువతి. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి (East godhavari) జిల్లా.. రాజమహేంద్రవరంలో (Rajamahendravaram) చేసుకుంది.
Also Read: Satyajith Passed Away: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ
వివరాల్లో వెళ్తే... మల్లయ్యపేటకు (Mallayyapeta)చెందిన పూలేటి లక్ష్మికి (Puleti Laxmi) ఇద్దరు పిల్లలు. కుమారుడు మోహిత్ శ్రీసత్య (5) కుమార్తె చిన్మయి (8). పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన పూలేటి రాముకు (Puleti Ramu) సీతానగరానికి (Seetha nagaram) చెందిన లక్ష్మీ అనూషతో 11 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కుటుంబంలో తరచుగా భార్య భర్తలిద్దరికి గొడవ అవటంతో మనస్తాపానికి గురైన రాము గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పటి నుండి తన ఇద్దరు పిల్లలతో మల్లయ్యపేటలో నివాసం ఉంటున్న లక్ష్మి ఆదివారం పిల్లలకు రాత్రి 11:30 గంటలకు విషం పెట్టి చంపేసింది. ఈ విషయం స్వయంగా తన తమ్ముడికి ఫోన్ చేసి తెలుపగా.. పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆలస్యం అవటంతో ఇద్దరు పిల్లలు చనిపోయారు.
Also Read: MAA Elections 2021: మెగాబ్రదర్ సంచలన నిర్ణయం..'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా
విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న త్రీటౌన్ సీఐ మధుబాబు (CI Madhubabu) విచారించగా.. కుటుంబ పరిస్థితి బాగోలేక.. ఆర్థిక ఇబ్బందిలా కారణంగా పిల్లలకు విషం పెట్టానని లక్ష్మి తెలిపింది. కానీ పిల్లలను ఎల్లపుడు చిత్ర హింసలకు గురి చేసేదని, రక్తం వచ్చేలా కొట్టేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. అంతేకాకూండా ఆమెకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని, పిల్లలని హత్య చేయటానికి వేరే కారణాలు ఉండొచ్చని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు .
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook