Movie songs on TTD LED screens: వెంకన్న ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఎల్‌ఈడీ స్క్రీన్‌ లో భక్తి గీతాలకు బదులు సినిమా పాటలు ప్రదర్శించారు. దీంతో భక్తులు ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యారు. ఈఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. దేవస్థానం ఎదురుగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్‌ లో హిందీ సాంగ్స్‌ ప్లే అయ్యాయి. భక్తి గీతాలు ప్లే కావాల్సిన చోట సినిమా పాటలు ప్రసారం కావడంపై భక్తులు కంగుతిన్నారు. ఈ తతంగం అంతా కూడా దాదాపుగా 15 నిమిషాల పాటు జరిగింది. ఈలోగా భక్తులు ఎల్‌ఈడీ స్క్రీన్‌ దృశ్యాలను మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవికాస్త వైరల్‌ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయ వ్యవహారాలను నిర్వహిస్తుంది. ఈ దేవస్థానానికి సంబంధించి ప్రత్యేక బ్రాడ్‌ కాస్టింగ్‌ వింగ్‌ కూడా ఉంది. అయినప్పటికీ సినిమా పాటలు ప్లే అవడం వెనక సిబ్బంది నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనిపిస్తోంది. ఇలాంటి ఘటనే గతంలోనూ జరిగింది. ఎల్‌ఈడీ స్క్రీన్‌ లో ప్రైవేటు ఛానల్‌ ను టెలికాస్ట్‌ చేశారు. అయితే ప్రస్తుతం జరిగిన ఘటనపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. సెటప్‌ బాక్స్‌ లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే ఎల్‌ఈడీ స్క్రీన్‌ లో సినిమా పాటలు ప్లే అయ్యాయని చెప్పారు.  అటు ఈ ఘటనపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (Somu veerraju) తీవ్రంగా మండిపడ్డారు. ఎస్‌వీబీసీ ఛానెల్‌ ను రాజకీయ నాయకులు నిర్వహించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. 3500 కోట్లలో ధర్మ ప్రచారానికి ఎంత కేటాయిస్తున్నారో ప్రజలకు లెక్క చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


Also read : Pawan Kalyan: పవన్ పర్యటనలో...జై జగన్‌ అంటూ నినాదాలు..!


Also read : Prashanth Kishor Strategy: కాంగ్రెస్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.