Andhra Pradesh: అమరావతి: అయోధ్యలో  ( Ram janma bhumi )  రామ మందిర నిర్మాణానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చేనెలలో రామ మందిరానికి శంకుస్థాపన చేయనున్నట్లు రామ మందిర ట్రస్ట్ కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishna Raju)  మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చి తన భక్తిని చాటుకున్నారు. Also read: Ayodhya: రామ జన్మభూమి శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సందర్భంగా.. తన మూడు నెలల జీతం 3,96,000ల రూపాయాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా జమ చేసినట్లు ఎంపీ రఘురామకృష్ణం రాజు సోమవారం ట్విట్ చేసి వెల్లడించారు. మందిర నిర్మాణానికి ఉడతా భక్తిగా ఈ విరాళం అందజేస్తున్నానని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు రామ మందిర నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.



ఇదిలాఉంటే ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ ట్విట్‌ను.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం, రక్షణ మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ లకు ట్యాగ్ చేయడం గమనార్హం. Also read: AP: గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ రమేశ్: ఏం జరగబోతోంది?