హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( RIL) అధినేత ముఖేశ్​ అంబానీ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించేందుకే ముఖేశ్ అంబానీ ఏపీ సీఎం జగన్‌ని కలిసినట్టు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"182613","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అంతకంటే ముందుగా ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎదురెళ్లి స్వాగతం పలికారు. ముకేష్ అంబానీ, ఆయన తనయుడు అనంత్‌లకు శాలువా కప్పి స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..