అమరావతి: బుధవారం ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3గంటల కు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశమవబోతోంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చిస్తారు. అలాగే కొన్ని కీలకమైన ప్రతిపాదనలకు కూడా ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నాయి.  అమరావతి రాజధాని పరిధితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు భూముల కేటాయింపు, నిరుద్యోగభృతి, భూసేవ వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి.


అలాగే, ఈ నెల 8,9 తేదీల్లో జరుగనున్న కలెక్టర్ల సదస్సు, సంక్షేమ పథకాలపై కూడా కేబినేట్ చర్చ జరుగుతుంది. వివిధ ప్రభుత్వ శాఖల నుండి అందిన ప్రతిపాదనలు, తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల నియామాకానికి అనుమతులు, ఏపీ ఫైబర్‌ నెట్‌ వంటి అంశాలపై చర్చించనున్నారు. పీఆర్సీ బకాయిలు, కొత్త పీఆర్సీ అంశాలు కూడా చర్చకు రానున్నాయని సమాచారం.