Schools reopening in AP: ఆగస్టు 16 నుంచి స్కూల్స్ రీఓపెన్.. నాడు నేడుపై సీఎం సమీక్ష
Schools reopening in AP, Nadu nedu review meeting: అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో రూపొందించిన నాడు నేడు కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష (Nadu nedu review meeting) చేపట్టారు.
Schools reopening in AP, Nadu nedu review meeting: అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో రూపొందించిన నాడు నేడు కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan).. ఆగస్టు 16 నుంచే పాఠశాలల పునఃప్రారంభించాలని.. అప్పుడే తొలి విడత నాడు-నేడు పనుల ఫలాలను ప్రజలకు అంకితం చేయాలని అధికారులను ఆదేశించారు.
నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షా (Nadu nedu review) సమావేశం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ''నాడు-నేడు కార్యక్రమం పనుల్లో ఎలాంటి అవినీతికి తావు ఉండకూడదు. అభివృద్ధి పనుల నాణ్యత, నిధుల వినియోగం విషయంలో చిన్న వివాదం కూడా రాకూడదని అధికారులకు సూచించారు. విద్యార్థుల కోసం నాడు-నేడు పేరుతో మంచి కార్యక్రమం చేపట్టాం. ఆ కార్యక్రమానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Also read : AP Inter Results 2021: ఏపీ ఇంటర్ సెకండీయర్ ఫలితాలు 2021 విడుదల
ఆగస్టు 16న పాఠశాలలు పునఃప్రారంభించిన (Schools reopening AP) సందర్భంలోనే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు సీఎం జగన్ తెలిపారు.
Also read : AP IAS Transfers: ఏపీలో అర్ధరాత్రి ఐఏఎస్ బదిలీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook