Nagababu Strong Comments on Ram Gopal Varma: జనసేన ఆధ్వర్యంలో రేపు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన కచ్చితంగా విజయవంతం చేయడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన నాగబాబు మీడియాతో మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కు అసలు ప్యాకేజీ తీసుకునే అవసరం ఉందా అని నాగబాబు ప్రశ్నించారు. తమకు ఈ ప్యాకేజ్ ఎవరిచ్చారు అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు, ఇక రాంగోపాల్ వర్మ గురించి ఆయన మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ ఒక పెద్ద ఎదవ, సన్నాసి అలాంటి నీచ్ కమీనే కుత్తే గురించి నేను మాట్లాడను అని అన్నారు. వాడు అవసరం కోసం ఎంతకైనా దిగజారుతాడని పేర్కొన్న నాగబాబు, కాపులకు ఆత్మాభిమానం లేదా? కాపులకు చాలా రెస్పెక్ట్ ఉంది అంటూ పేర్కొన్నారు.


ఇక త్మకు కులపిచ్చి లేదని అన్ని కులాలను గౌరవిస్తామని ఈ సందర్భంగా నాగబాబు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతానికి యువత ఆలోచనలకు సోషల్ మీడియా పరిమితం అవుతున్నాయని వారిని ప్రజాక్షేత్రంలోకి తీసుకువచ్చేందుకు జనసేన వారికి అండగా ఉంటుందని అన్నారు. ప్యాకేజ్ ప్యాకేజ్ అని మొరుగుతున్నారు ప్యాకేజీ మీ అమ్మ మొగుడు ఇచ్చాడా? అని కొడాలి నాని స్టైల్ లో నేను అడగవచ్చు కానీ అలా అనేందుకు తన సభ్యత అడ్డు వస్తోందని నాగబాబు పేర్కొన్నారు. ఇక మాకు ఉన్న డబ్బును రిసోర్స్ ని అందరికీ పంచుతుంటే కొంతమంది ప్యాకేజీ అంటూ ఇంకా భావ దారిథ్యంతో మాట్లాడుతున్నారని నాగబాబు ఈ సందర్భంగా విమర్శించారు. ఇక మీ తాత మీ అయ్యా ఏమైనా మాకు ప్యాకేజీలు ఇచ్చారా అంటూ నాగబాబు ప్రశ్నించారు.


Also Read: Chiranjeevi on Allu Arjun: అల్లు అర్జున్ మెగా టాగ్ మీద చిరు కామెంట్స్.. అవసరమే లేదంటూ!


Also Read: Chiranjeevi Vs Balakrishna: 9 సార్లు సంక్రాంతికి బాలయ్య-చిరు పోటీ.. ఎవరెన్ని హిట్లు కొట్టారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook