Good News To YS Jagan: ఎన్నికలు ముగిసిన తర్వాతి రోజే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి శుభ పరిణామం చోటుచేసుకుంది. విదేశాలకు వెళ్లేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) న్యాయస్థానం అనుమతినిచ్చింది. కొన్ని ఆంక్షలతో విదేశాలకు సీఎం జగన్‌కు అనుమతిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Elections Voting: ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్స్‌పై ఎన్నికల సంఘం సంచలన ప్రకటన.. దాడులు, దౌర్జన్యాలపై


 


ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు భారీ ఊరటనిచ్చింది. అతడి విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 17 నుండి జూన్ 1వ తేదీ వరకు కుటుంబంతో కలిసి జగన్ విదేశీ ప్రయాణం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు జగన్‌  విదేశీ పర్యటన వెళ్లేందుకు అనుమతి ఇస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇవ్వడం గమనార్హం.

Also Read: Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లు


 


అనుమతినిస్తూనే కోర్టు కొన్ని ఆంక్షలు విధించింది. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు వ్యక్తిగత ఫోన్ నంబర్, జీ మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని జగన్‌ను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సీఎం జగన్‌ విదేశీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. 


అక్రమాస్తుల కేసు, ఈడీ కేసులు సీఎం జగన్‌పై ఉన్న విషయం తెలిసిందే. బెయిల్‌పై ఉన్న జగన్‌ విదేశాలకు వెళ్లడం నిషేధం. ఎక్కడికి వెళ్లాలన్నా న్యాయస్థానం ఆదేశాలు తప్పక తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల పోలింగ్‌ తర్వాత ఫలితాల వెల్లడికి దాదాపు 20 రోజుల వ్యవధి ఉండడంతో విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్‌ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఈనెల 9వ తేదీన నాంపల్లి సీబీఐ కోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై స్పందించాలని కోర్టు కోరగా.. సీబీఐ జగన్‌ పర్యటనకు అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని చెప్పి జగన్‌ కోర్టుకు విన్నవించడం.. ఎన్నికలు-ఫలితాల మధ్య కొన్ని రోజులు విరామం ఉన్న నేపథ్యంలో సీబీఐ కోర్టు విదేశీ ప్రయాణానికి అనుమతినిచ్చింది.


వాస్తవంగా ప్రతియేటా సీఎం జగన్‌ తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తుంటారు. తన తండ్రి వైఎస్సార్‌ కూడా ఇలాగే చేసేవారు. ఏడాదంతా ప్రజా జీవితంలో బిజీగా ఉన్న జగన్‌ కనీసం వారం రోజులైనా కుటుంబంతో హాయిగా జీవించాలని ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకుంటారు. గతేడాది కూడా లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఆయన ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. జగన్‌, తన భార్య భారతి, ఇద్దరు కుమార్తెలతో కలిసి వారం రోజులు పర్యటించే అవకాశం ఉంది. పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడంతో రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలు కొంత పక్కనపెట్టి జగన్‌ ఉల్లాసంగా గడపనున్నారు. గతంలో విదేశీ పర్యటనల సమయంలో జగన్‌ సాహస కృత్యాలు చేసిన విషయం తెలిసిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter