Balakrishna Shocked To YS Jagan: అధికారం కోల్పోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి జిల్లాల్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కంచుకోటగా ఉన్న రాయలసీమలోనూ పరిస్థితి దారుణంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీమలోనే వైసీపీకి చెప్పుకోదగ్గ సీట్లు రాగా.. ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోంది. స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి గడ్డు కాలం ఏర్పడింది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా వైసీపీకి భారీ షాకిచ్చాడు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Duvvada Srinivas Issue: వైఎస్‌ జగన్‌ సంచలనం.. దువ్వాడ శ్రీనివాస్ రాజీనామాకు ఆదేశం?


శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ వశమైంది. వైఎస్సార్‌సీపీకి చెందిన చైర్‌పర్సన్‌, ఇతర కౌన్సిలర్లు టీడీపీ కండువా వేసుకున్నారు. దీంతో హిందూపురం మున్సిపల్‌ పీఠంపై పసుపు జెండా ఎగిరింది. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ తనదైన వ్యూహంతో మున్సిపాలిటీని చేజిక్కించుకున్నాడు. ఈ పరిణామంతో వైసీపీ పూర్తిగా డీలా పడింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Also Read: Chandrababu: నెక్ట్స్‌ టార్గెట్‌ కొడాలి నాని.. చంద్రబాబు గుడివాడ పర్యటనపై ఉత్కంఠ


 


చేరికలు
వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ, తొమ్మిది మంది కౌన్సిలర్లు శుక్రవారం టీడీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూపురం మున్సిపల్ పరిధిలో 38 వార్డుల్లో 30 మంది వైఎస్సార్‌సీపీ తరఫున కౌన్సిలర్లుగా గెలిచారు. టీడీపీ తరఫున ఆరుగురు, బీజేపీ, ఎంఐఎం చెరో ఒక్క కౌన్సిలర్ సీటును పొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడం.. వైఎస్సార్‌సీపీకి భవిష్యత్‌ లేదని గ్రహించిన ఆ పార్టీ కౌన్సిలర్లు క్రమంగా పార్టీని వీడుతున్నారు. మరికొన్ని రోజుల్లో మిగతా కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది.


పార్టీ విధానాలు నచ్చక
అయితే టీడీపీలో చేరిన అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ విధి విధానాలు నచ్చక టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఇప్పటికే బీజేపీ మిత్రపక్షం కావడం.. ఎంఐఎం కౌన్సిలర్‌ ఇప్పటికే టీడీపీలో చేరడంతో మున్సిపాలిటీలో టీడీపీ బలం పెరిగింది. తాజాగా చేరిన పది మందితో కలిపి టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య 17+1 (బీజేపీ)తో చైర్మన్‌ పదవి టీడీపీ వశం కాబోతున్నది. మిగతా కౌన్సిలర్లు కూడా చేరుతుండడంతో హిందూపూర్‌ మున్సిపాలిటీ అధికారికంగానే టీడీపీ వశం కాబోతున్నది. పార్టీ నాయకుల చేరికపై బాలకృష్ణ దృష్టి సారించడం విశేషం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter