సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు.నల్గొండ జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందట మరణించారు. తలకు తీవ్రగాయమై అధిక రక్తస్రావం కావడంతో వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో.. నారా, నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఉదయం నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరులో ఒక వివాహ వేడుకకు హాజరై హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో హరికృష్ణతో పాటు నలుగురు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే హరికృష్ణ తనయులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ తమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని బయలుదేరారు.