Nara Bhuvaneswari: ఏపీ అసెంబ్లీ పరిణామాల(Andhra Pradesh Assembly)పై స్పందించారు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari). ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా...తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని 


ఆమె ప్రకటనలో ఏమన్నారంటే..‘‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం.


విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు భువనేశ్వరి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook