అమరావతి: వైఎస్ జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ మరోసారి ట్విటర్ ద్వారా విమర్శల వర్షం కురిపించారు. ‘మీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడి మీద మీరు కేసు పెడితే.. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డుమీద కాల్చి చంపాలి అని అన్న మిమ్మల్ని ఏం చెయ్యాలి..? వైఎస్ జగన్ గారూ? ఉరి తియ్యాలా?’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అంతేకాకుండా ‘మీకు, మీ నాయకులకు దమ్ముంటే టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి కానీ చేతగాని దద్దమ్మల్లా కేసులు పెట్టి పారిపోకండి అంటూ వైసిపి నేతలకు లోకేష్ ఛాలెంజ్ చేశారు.