ప్రధాని మోడీని కాలకేయుడితో పోల్చిన నారా లోకేష్ !!
చంద్రబాబుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు
ఏపీ పర్యటనలో భాగంగా చంద్రబాబుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పాలన లోపాలను ఎత్తిచూపుతూ యూటర్న్ బాబు అంటూ మోడీ చేసిన విమర్శలకు లోకేష్ బదులిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీకి దూరం పెట్టామన్నారు. ఏపీకి మోసం చేసిన మోడీకి ఏపీ ప్రజలు క్షమించని నారా లోకేష్ వ్యాఖ్యనించారు.
ఈ సందర్భంగా లోకేష్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు బాహుబలిలా పోరాడుతుంటే.. హోదా రాకుండా చేయాలని ప్రధాని మోడీ..కాలకేయుడలా దండయాత్ర చేస్తున్న లోకేశ్ ధ్వజమెత్తారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం అన్న మోడీకి లెక్కలేదని..అలాంటి వ్యక్తి ఇక్కడ ప్రచారం చేయడం దారుణమని లోకేష్ విమర్శించారు.
హెరిటేజ్ ను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై మోడీ చేసిన వ్యాఖ్యలకు లోకేష్ సమాధానం ఇచ్చారు. హెరిటేజ్ గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబును విమర్శిస్తున్న మోడీకి జగన్ అక్రమాస్తుల గురించి ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. మోడీ తీరు చూస్తుంటే జగన్ ఆక్రమ ఆస్తులకు కాపలాదారుగా మారారని అనమానం కలుగుతోందని నారా లోకేష్ విమర్శించారు.