మంగళగిరిలో  టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. లోకేష్ పై 5 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో  వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి   విజయం సాధించారు.  ఒక వైపు పార్టీ పరాజయం పాలైంది. కనీసం అసెంబ్లీ లో ప్రతిపక్ష పాత్రలో సత్తా చాటేందుకు లోకేష్ కు ఛాన్స్ లేకపోయింది. మంగళగిరిలో 1985 నుంచి ఇప్పటి వరకు టీడీపీ గెలవలేదు. ఒక వేళ లోకేష్ గెలుపు సాధించినట్లయితే సరికొత్త రికార్డు సృష్టించినట్లే. కానీ అలా జరగలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందలు
మంగళగిరిలో నారా లోకేశ్ విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్‌ అంచనా  వేశాయి. అయితే ఆయన ఓటమిపాలవ్వడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎన్నికల ఫలితాల లెక్కింపు మొదలైన దగ్గర్నుంచే లోకేశ్ వెనుకంజలో ఉన్నారు. మధ్యలో పుంజుకున్నప్పటికీ చివరికి విజయానికి మాత్రం చేరువ కాలేకపోయారు.  


లోకేష్ ఓటమి చంద్రబాబుకు పెద్ద షాక్..


ఒకవైపు పార్టీ ఓటమి చంద్రబాబుకు బాధను మిగిల్చితే .. తన తనయుడు లోకేష్ పరాజయం పాలవడం చంద్రబాబును జీర్ణించుకోలేక స్థితికి చేర్చిందని చెప్పవచ్చు. తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన చంద్రబాబు ఆశలు అడిఆశలయ్యాయి. ఇదిలా ఉండగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన తమ భవిష్యత్తు నాయకుడు లోకేష్ ఓడిపోవడాన్ని తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.