Lokesh fire on ttd : తిరుమలలో సినిమా పాటల.. కవర్ చేయడానికి ఏం సినిమా స్టోరి చెప్తారో : నారా లోకేష్
గతకొంతకాలంగా తిరుమలలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని భక్తులతో పాటు ప్రతిపక్షాలు అరొపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలను భ్రష్ఠు పట్టించిందని టీడీపీ అరోపిస్తుంది.
Nara Lokesh Fire On TTD: గతకొంతకాలంగా తిరుమలలో టిటిడి అధికారుల నిర్లక్ష్యం వల్లే శ్రీవారి ప్రతిష్ఠ దెబ్బతింటుందని భక్తులతో పాటు ప్రతిపక్షాలు అరొపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమలను భ్రష్ఠు పట్టించిందని టిటిడి అరోపిస్తుంది. ఇటీవల కొండ మీద ఎల్ఇడీ స్క్రీన్ల మీద అరగంట పాటు సీనిమా పాటలు ప్రసారం అయిన ఎవరు పట్టించుకోలేదని దీనిపై భక్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాంకేతిక లోపం కారణాంగానే ఇది జరిగిందని టీటీడీ అధికారులు ఈవిషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై టీటీడీ అధికారిక ప్రకటన కూడా చేయలేదు. టిటిడిలో పనిచేస్తున్న ఉద్యోగి స్నేహితుడి కారణంగానే ఈతప్పిదం జరిగిందని ఈఘటనపై విచారణ జరిపి భాద్యులపై చర్యలు తీసుకుంటామని టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమలలో సినిమా పాటలు ప్రసారం కావడంపై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు."దేవుడంటే ఆటలుగా ఉందా? ఏడుకొండలవాడి సన్నిధిలో సినిమా పాటలా? భక్తులకు నరకం చూపిస్తున్నారు. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు. గోవిందనామస్మరణతో మారుమోగే తిరుమలగిరుల మీద సినిమా పాటలతో ప్రదర్శన దారుణం. ఈ అపచారాన్ని కవర్ చేసుకోవడానికి ఏ సినిమాటిక్ కథ వినిపిస్తారో అంటూ ట్వీట్టర్ ద్వారా ఫైర్అయ్యారు.
అలాగే మొన్న శ్రీవారి భక్తులను కొండమీదికి అనుమతించకుండా తిరుపతిలోనే అపడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇసందర్భంగా తొక్కసలాట కూడా జరిగింది. విఐపీ భక్తులను అనుమతిస్తు సామాన్య భక్తులను దేవదేవుడికి దూరం చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు.
Also Read: Yadadri CM KCR:యాదాద్రి సన్నిధిలో మహాకుంభాభిషేక మహోత్సవం..!
Also Read: World Malaria Day 2022: మలేరియా దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ..మలేరియా లక్షణాలు, నివారణ చర్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.