అమరావతి: రాష్ట్రాన్ని దోచి, జైలుకి వెళ్లి వచ్చి కూడా ముఖ్యమంత్రి అవ్వొచ్చని, అందరూ తప్పులు చెయ్యడం మొదలు పెడితే రాష్ట్రానికే ప్రమాదమని అలాంటి కోరికలు నాకు లేవని, టీఎన్ఎస్ఎఫ్  మేధోమదన సదస్సులో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సామాజిక మాధ్యమాల్లో వైకాపా బాష అనైతికంగా ఉందని, వాడుక భాషకు బిన్నంగా ఉందని నారా లోకేష్ మాట్లాడుతూ.. మీ నాన్న ఎవరు అని తెలుగులో అడుగుతామని, హూ ఈజ్ యువర్ ఫాదర్ అని ఇంగ్లీష్ లో అడుగుతామని, అదే వైకాపా భాషలో అయితే నీ అమ్మ మొగుడు ఎవరని అడుగుతారని నారా లోకేష్ అన్నారు. 


చంద్రబాబు హయాంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదంటూ అసత్యాల యాత్ర చేసిన జగన్, ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు తానే ఒప్పుకుంటున్నారని, అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు హయాంలో రాష్ట్ర యువతకి 9,56,263 ఉద్యోగాలు వచ్చాయని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారని ఆయన అన్నారు. పరిశ్రమల ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. 



విశాఖ ఐటీ, మెడికల్ హబ్, రాయలసీమ ఎలెక్ట్రానిక్స్, ఆటోమొబైల్ హెడ్ క్వార్టర్ గా తయారు చేశామని, ఒక్క ఫ్యాక్స్ కాన్ కంపెనీలో 20 వేల మంది మహిళలు పని చేస్తున్నారని, కీయా రావడం వల్ల అనంతపురం జిల్లా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. బిసి,ఎస్సి విద్యార్థులకు చెందాల్సిన సొమ్ము, కార్పొరేషన్ల ద్వారా వారి కోసం ఖర్చు చెయ్యాల్సిన సొమ్ము పక్కదారి పడుతోందని, విదేశీ విద్య ద్వారా తమ ప్రభుత్వం ఎంతో మంది బడుగు, బలహీన వర్గాల పిల్లలను ఉన్నత చదువులకు సహకారం కల్పించామని, 9 నెలల్లో ఒక్క రూపాయి విదేశీ విద్యకి కేటాయించలేదని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..