MLC Ananthababu: ఏపీలో ప్రకంపనలు రేపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుల అరెస్టుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంధ్రబాబు ప్రకటించారు. జిల్లా ఎస్పీ ప్రకటించి 30 గంటలు దాటినా ఇంకా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నారు. కాకినాడ పోలీసులపై ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్ ను దారుణంగా హత్య చేశారని అన్నారు. హత్య చేసిన ఎమ్మెల్సీని పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఎందుకు పోలీసులకు దొరకడం లేదన్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలోనే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారని నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో సోదాలు చేస్తే నిందితులు దొరుకుతారని అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబానికి కోటీ రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు లోకేష్. జగన్ పాలనలో మహిళలు, దళితులకు రక్షణ లేదన్నారు.


READ ALSO: Hyderabad Honour Killing: నీరజ్ హత్యకు పక్కా స్కెచ్.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు


READ ALSO: Gaddar Meet Amit sha: అమిత్ షాను గద్దర్ ఎందుకు కలిశారు? బీజేపీ సభలో అసలేం జరిగింది? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook